చంద్రబాబూ..! నువ్వు మగాడివేనా.. వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న

Update: 2020-01-07 14:33 GMT
తన కారుపై దాడి చేసింది రైతులు కాదని.. చంద్రబాబు పంపిన మనుషులని వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేయొద్దని.. మగాడివైతే ముందుకు రావాలని సవాల్ విసిరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది తగదని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రైతులను దగా చేయాలని చూస్తున్నారని, బాబు ట్రాప్ లో పడొద్దంటూ రైతులకు సూచించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని, ఆయన తన మనవడితో ఆడుకోవడం మంచిదంటూ సెటైర్లు విసిరారు.

కాగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారిపై పిన్నెల్లి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజధాని రైతుల ముసుగులో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. తన కారుపై దాడి చేసిన వారిలో రైతులెవరూ లేరని ఆయన అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేశారని.. పెద్ద పెద్ద రాళ్లు విసిరారని.. రైతులైతే వారి వద్ద రాళ్లు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేస్తున్నారని సర్వీసు రోడ్డులో నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని... ఆ దారిలో వైసీపీ నేతలు - ఎమ్మెల్యేలు - మంత్రులు ఎవరు వెళ్లినా దాడి చేయాలని ప్లాన్ చేసి అక్కడ కాపు కాశారని.. వారెవరూ రైతులు కారని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ముసుగు తీసుకుని ముందుకు రావాలన్నారు. హిజ్రాల్లాల ఇంట్లో కూర్చుని కథ నడపడం కాదు, దమ్ముంటే మగాళ్లయితే ఎదురుగా రావాలని సవాల్ విసిరారాు. డైరెక్ట్‌గా తమను టచ్ చేస్తే ఏం జరగాలో అది జరుగుతుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
 
Tags:    

Similar News