ఫైర్ ఇంజ‌న్ క‌న్నా పిజ్జా ఫాస్ట్‌ గా వ‌స్తుంది!

Update: 2017-06-24 11:12 GMT
పంజాబ్ లో అగ్నిమాపక సిబ్బంది పనితీరుపై మాజీ క్రికెటర్ - రాష్ట్ర మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ త‌న‌దైన  శైలిలో చ‌మ‌త్కారంగా మండిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ వైర‌ల్‌ గా మారింది. పంజాబ్ లో ఫైరింజ‌న్ క‌న్నా పిజ్జా ఫాస్ట్‌ గా వ‌స్తుంద‌ని సెటైర్ వేశారు. అసెంబ్లీలో అడిగిన‌ ఓ ప్ర‌శ్న‌కు ఈ విధంగా బ‌దులిచ్చారు సిద్ధూ!

గురువారం జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే న‌వ‌తేజ్ సింగ్ చీమా ఫైర్ ఇంజ‌న్ల సేవ‌ల్లో జాప్యం గురించి సిద్ధూని ఓ ప్ర‌శ్న అడిగారు. త్వ‌ర‌లోనే ఆ సేవ‌ల‌ను మెరుగుప‌రుస్తామ‌ని సిద్ధూ  స‌మాధాన‌మిచ్చారు. వాస్త‌వానికి పంజాబ్‌ లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే అందుబాటులో ఉండ‌డంపై సిద్దూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అందులో కాలం చెల్లినవి 100 ఉన్నాయ‌ని, కేవలం 50  మాత్ర‌మే ప‌ని చేస్తున్నాయ‌ని చెప్పారు.

గ‌త ప్ర‌భుత్వాల వైఫ‌ల్యం వ‌ల్లే ఫైర్ ఇంజ‌న్ల సేవ‌ల‌లో జాప్యం జ‌రుగుతోంద‌ని సిద్ధూ చెప్పారు. ప్ర‌స్తుతం పిజ్జా ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని సంబంధిత అధికారుల‌కు ఆయన సూచించారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News