పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ ..72 ఫ్యామిలీలు క్వారంటైన్‌లోకి !
ప్రస్తుతం కరోనా మహమ్మారి అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. అయితే , ఈ తరుణంలో కూడా కొంతమంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఆలా ఈ సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారు తస్మాత్ జాగ్రత్త... కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని మమహ్మారి ఎటు వైపు నుంచి కాటు వేస్తోందో తెలియని పరిస్థితి. తాజాగా పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడు డెలివరీ చేసిన 72 ఫ్యామిలీలను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిత్యం పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి తాజాగా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి తో పాటు పనిచేసిన మరో 16 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు.
అలాగే బాధితుడు ఫుడ్ డెలివరీ చేసిన ఇళ్ల వివరాలను అధికారులు సేకరించారు. దాదాపు 72 ఫ్యామిలీలను గుర్తించి వారిని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. అయితే డెలివరీ బాయ్స్ ముఖానికి మాస్కులతోనే విధులు నిర్వర్తించారని, కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని అధికారులు చెప్తున్నారు. అయితే , డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలడం తో అతడి వద్ద ఫుడ్ తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.