2009లో గుజరాత్ లో.. 2014లో కేంద్రంలో మోడీని గెలిపించాడు... ఆ తర్వాత బీహార్లో నితీష్ ను అందలమెక్కించాడు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన టీడీపీని, చంద్రబాబును తుత్తునియలు చేసి పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఏపీకి సీఎం చేశారు. దీంతో ఇప్పుడు దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను గెలిపించే పనిలో పడ్డారు. ఆ తర్వాత బెంగాల్ లో దీదీ మమతా బెనర్జీని వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. పీకే రేంజ్ ఇప్పుడు తమిళనాడులో పార్టీపెట్టిన కమల్ హాసన్ కూడా తెలిసివచ్చింది. అందుకే తన గెలుపు బాధ్యతను ఆయన భుజాన పెట్టి శరణువేడాడు. ప్రస్తుతం కమల్ కు కూడా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ మారిపోయాడు. బీజేపీ వ్యతిరేకులకు ప్రశాంత్ కిషోర్ సాయం చేస్తుండడం ఆ పార్టీనీ ఓడిస్తుండడం శరాఘాతంగా మారింది. ఇదే టైంలో సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా బీజేపీని పీకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
అయితే బీజేపీకి ఇప్పుడు షాకుల మీద షాకులు వచ్చాయి. కాంగ్రెస్ ను తుత్తునియలు చేసి కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి పీకే నిద్రలేకుండా చేస్తున్నారు.
తాజాగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఈ దశాబ్ధాపు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా.. ఆయనదే హవా అని ప్రశాంత్ కిషోర్ ను గుర్తించింది. గత దశాబ్ధంలో పీకే తెరవెనుక వ్యూహాలతో అత్యంత కీలక శక్తిగా ఎదిగారు. ఇప్పుడు వచ్చే పదేళ్లలో కూడా పీకే మేనియా ఉండబోతోంది. ఈ పరిణామం దేశంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో చెలరేగిపోతున్న బీజేపీని కలవరపెడుతోంది. ఫోర్బ్స్ జాబితాలో దశాబ్ధపు కీలక వ్యక్తిగా ఎంపికైన పీకే ఎఫెక్ట్ కు బీజేపీపై కచ్చితంగా పడుతుందన్న వాదన వినిపిస్తోంది.