ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుందా? జనసేనాని పవన్ ధాటికి పొలిటికల్ ఫీల్డ్‌లో నువ్వా-నేనా అన్నట్టుగా ఉన్న అధికా ర, ప్రతిపక్షాలు.. వెనకబడ్డాయా? రాజకీయ రంగస్థలంపై `సీన్` మారిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత మూడు రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణా మాలు.. వైసీ పీ, టీడీపీలను వెనక్కి నెట్టాయని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు.. ఏపీ సమస్యల పై ఎలుగెత్తిన విధానం వంటివి.. రాజకీయంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ము ఖ్యంగా ఏపీ మంత్రులు నోరు జారి మాట్లాడిన తీరు.. అధికార పార్టీకి మైనస్‌గా మారిపోయింది.
ముఖ్యంగా జనసేనాని పవన్ ఆహ్వార్యం, భాష వంటివి చూసినట్టు.. ఫుల్‌గా ఛేంజ్ కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. ఇక, ఇదే విషయంపై దృష్టి పెట్టిన జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా.. దీనిపై జోరు గా చర్చించుకుంటున్నారు. రిపబ్లిక్ సినిమా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన పవన్.. చాలా రోజుల తర్వా త.. ఏపీ పాలిటిక్స్‌పై నేరుగా గురిపెట్టారు. సినిమా టికెట్ల విషయంలో పవన్ చేసిన కామెంట్లు డైన మైట్ల మాదిరిగా పేలాయి. దీంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీనికి కొనసాగింపుగా.. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. మరింత దూకుడు చూపించింది.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎటువైపు! అనే విషయంలో కొంత క్లారిటీ రావడం.. పవన్‌కు అండగా కొ న్ని జిల్లాల నాయకులు నిలబడడం వంటివి జనసేనలో ఊపు తెచ్చిందనడంలో సందేహం లేదు. అదేస మయంలో యువతలో పవన్ దూకుడు మళ్లీ జోష్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని.. వైసీపీని 15 సీట్లకే పరిమితం చేస్తామని.. ప్రస్తుతం కౌరవ సభ నడుస్తోందని.. త్వరలోనే పాండవుల సభ ను చూపిస్తామని.. చేసిన వ్యాఖ్యలు.. యువతలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాబోమని.. అందరినీ కలుపుకొని పోతామని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇక,గత ఎన్నికల నాటికి రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితికి మధ్య వ్యత్యాసం.. స్పష్టంగా కనిపిస్తోం ది. మాట తీరు.. దూకుడు.. వెనుక వ్యూహం.. అందరినీ ఆకర్షించే విధానం వంటివి జనసేనకు మంచి మార్కులు పడేలా చేశాయని.. జనసైనికులు చెబుతున్నారు. అదేసమయంలో ఇక నుంచి ప్రజల్లోనే ఉంటామని.. పటిష్టమైన పునాదులు నిర్మిస్తామని కూడా పవన్ చెప్పడాన్ని బట్టి.. ఇక, పూర్తిస్థాయిలో .. యువత జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం.. సామాజిక వర్గాలకు సమన్యాయం చూడడం.. వంటివి కూడా పవన్‌కు ప్లస్ అవుతున్నాయి. ఎలా చూసుకున్నా.. జనసేనాధ్యక్షుడి గ్రాఫ్ నింగినంటిందని.. ఆయన దూకుడుకు మంచి మార్కులు పడుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో ఇదే విధానం కొనసాగించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని అంటున్నారు జనసేన నేతలు.