ఎలా బతికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెలా మారిందన్నది చూసినప్పుడు అయ్యో.. పాపం అనుకుండా ఉండలేం. కాలానికి అనుగుణంగా ఆ పార్టీ మారి ఉన్నా.. పార్టీని నడిపించే నాయకత్వం ఆలోచనాధోరణి కాస్తంత మారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది.
దేశ ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనల్ని చూసి కూడా చూడనట్లుగా కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరించటం కూడా తాజా పరిస్థితి కారణంగా చెప్పక తప్పదు. పీకే అనబడే ప్రశాంత్ కిశోర్ అనే మేధావి రాజకీయ వ్యూహకర్త కోసం అంత పెద్ద కాంగ్రెస్ వెంపర్లాడటం ఏమిటి? ఎందుకంటే.. అతడి వెనుకున్న ట్రాక్ రికార్డు.. విజయమే తప్పించి అపజయమే ఎదురు కాని ఆయన మైండ్ సెట్ తాము వంట బట్టేసుకుంటే అర్జెంట్ గా అధికారంలోకి వచ్చేయాలన్న తపన తప్పించి.. పీకేతో మనకు వర్కువుట్ అవుతుందా? లేదా? అన్న విషయంపై ఆ పార్టీ ఏమేర ఆలోచించిందన్న సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి.
కాంగ్రెస్ కు ఏ మాత్రం సెట్ కాని కేసీఆర్ తో రాసుకుపూసుకోవటమే కాదు.. ఆయన విజయం కోసం వ్యూహాల్ని సిద్ధం చేస్తానని మాట ఇచ్చిన ఆయన తీరు తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఓవైపు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకే పార్టీలోకి వస్తున్నట్లు చెప్పి.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పార్టీకి ప్రత్యర్థి అయిన కేసీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకున్న వైనం చూస్తే.. ఆదేం గోలరా బాబు? అనుకోకుండా ఉండలేం. నిజానికి టీకాంగ్రెస్ లో ఇప్పుడు పీకే కన్ఫ్యూజన్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
అతగాడు పార్టీకి వరమా? శాపమా? అన్న దానిపై వారు తేల్చుకోలేకపోతున్నారు. గడిచిన రెండు రోజలుగా ప్రగతిభవన్ లో ఉండి.. గంటల కొద్ది సమయాన్ని సీఎం కేసీఆర్ తో గడిపిన పీకే.. చివరకు తాను కాంగ్రెస్ లో చేరినా.. తమ సంస్థ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తుందన్న ఒప్పందాన్ని చేసుకోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
పీకే విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో అధిష్ఠానం వారిని గైడ్ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడిన కాంగ్రెస్ అధినాయకత్వం.. తొందరపాటు వద్దని.. అన్ని విషయాల్ని అధిష్ఠానమే చూసుకుంటుందని.. రెండు.. మూడు రోజులు ఓపిక పట్టాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పీకే పుణ్యమా అని కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ మాత్రమే కాదు.. ఇదేం గోలరా బాబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.