షాకింగ్ నిజాలు బయటపెట్టిన పీకే టీం..

Update: 2022-03-12 23:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా..? ఉద్యమ కారులు తమకు న్యాయం జరగలేదని అంటున్నారు..? బీటీ బ్యాచ్.. టీయూ బ్యాచ్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయా..? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉండబోతుంది..? ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఇలాంటి 22 అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రశాంత్ కిశోర్(పీకే) టీం సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషాలను టీఆర్ఎస్ అధినేత ముందుంచింది. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందులో వివరించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన  లక్ష్యంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). 2001 లో ఏర్పడిన ఈ పార్టీ దాదాపు 13 ఏళ్లు పోరాడి ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా మారింది. అయితే టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించిన  ఆ తరువాత ఉద్యమకారులంతా ఈ పార్టీకి చేదోడుగా నిలిచారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ చేస్తున్న పనులకు వెన్నంటే ఉంటూ వచ్చారు. భవిష్యత్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాసారు.

మొత్తంగా 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎష్ ఏనిమిదేళ్లుగా పాలిస్తూ వస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉంది. కేసీఆర్ పై కూడా నమ్మకం ఉంది. కానీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారును పార్టీ నాయకత్వం పక్కనబెట్టిందిన్న ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఉద్యమం చేస్తున్న సమయంలో తమపై కేసులు పెట్టించినవారికే ఇప్పుడు పార్టీలో అందలమెక్కించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బంగారు తెలంగాణలో భాగంగా ఇతర పార్టీల నుంచి కొందరని చేర్చుకోవాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు. కానీ ఇప్పుడు వారే పైచేయి సాధించి.. చిన్న చిన్న పనులకు వారిని బతిమిలాడాల్సి వస్తోందని ఉద్యమకారులు అంటున్నారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. టీఆర్ఎస్లో ఎంతో కాలంగా అణచివేతకు గురవుతున్నవారిని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. అయితే సమయం చూసి పార్టీ మారేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ కొందరు బీజేపీపై నమ్మకం లేకపోవడంతో వెనకాముందు ఆలోచిస్తున్నారు. అటు కాంగ్రెస్ కొత్త నాయకత్వమని మురిసినా రాను రాను ఆ పార్టీ పరిస్తితికూడా మారకపోవడంతో ఎటూపోలేక పార్టలోనే కొనసాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కు ఇప్పుడు ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పోటీగా మారి పార్టీని ఒత్తిడిలోకి తెస్తున్నాయి.

ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. వివిధ రాష్ట్రాల ముక్యమంత్రులను కలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీ ఐదురాష్ట్రాల్లో హవా సాగించడంతో ఇప్పుడు సొంత రాష్ట్రంలోనూ గెలవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎందుకంటే త్వరలో బీజేపీ చూపు దక్షిణాదిపై పడనుంది. ముఖ్యంగా తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి టీఆర్ఎస్ తట్టుకునే శక్తిగా ఎదురొడ్డి నిలవాల్సిన అవసరం ఉంది.

ఈనేపథ్యంలో పీకే టీం 22 రకాల  ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొత్తంగా ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటే పార్టీకి కొంత కలిసి వస్తుందన్న అంచనాకు వచ్చారు. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలకు వెలితే ఏం జరుగుతుందో నివేదికలో సమర్పించారు. అలాగే కేసీఆర్ ప్రశేవపెట్టిన పథకాలపై ప్రజల్లో మంచి సంకేతం ఉన్నా ఎక్కడో అసంతృప్తి మాత్రం నెలకొంది. అయితే ఎక్కడ అవకాశం దొరికినా దానిని బీజేపీ క్యాష్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అప్రమత్తమై వచ్చే ఎన్నికల్లోపు బలపడే అవసరవముందని పీకీ టీం సూచించినట్లు సమాచారం.
Tags:    

Similar News