జగన్‌ సైలెన్స్‌ వెనుక వ్యూహం ఏంటి.?

Update: 2019-03-08 10:20 GMT
ఏపీలో ఎన్నికల హడావుడి స్టార్ట్‌ అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాలేదనే కాని.. ఇప్పటికే చాలమంది అభ్యర్థులు తమ నియోజక వర్గాల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. గత వారం రోజుల నుంచి నియోజకవర్గాల రివ్యూ మీటింగ్‌ లో  భాగంగా  అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే దాదాపు 80 శాతం మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించేంసింది. మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్‌ యాదవ్‌ లాంటి వాళ్లు మంచి రోజు చూసుకుని ప్రచారంలో కూడా దిగిపోయారు. అటు పవన్‌ కల్యాణ్‌ కూడా తనకు బలమైన అభ్యర్థులు ఉన్నచోట లీడర్స్‌ ని ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం.. కచ్చితంగా అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్న వైసీపీ మాత్రం ఇంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు.

అభ్యర్థుల విషయంలో జగన్ చాలా కూల్‌ గా వ్యూహాత్మకంగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు కన్‌ ఫర్మ్ అయిపోయారు. కానీ విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. నోటిఫికేషన్‌ వచ్చిన రెండు రోజుల తర్వాత తన అభ్యర్థుల లిస్ట్‌ ని ప్రకటించాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు తొందరపడి ఎనౌన్స్‌ చేస్తే.. సీట్లు కన్‌ ఫర్మ్‌ కానివాళ్లు.. అసమ్మతి నేతలుగా మారే అవకాశం ఉంది. దీన్ని టీడీపీ అవకాశంగా తీసుకోవచ్చు. మరోవైపు.. టీడీపీ అభ్యర్థుల లిస్ట్‌ మొత్తం అయిన తర్వాత.. ఆ పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఉండేలా తమ పార్టీ కేండిడేట్స్‌ ని నిలబెట్టుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిగ్గా డామినేషన్‌ వచ్చినట్లు అవుతుంది. నియోజకవర్గంలో అవతలి పార్టీ డిఫెన్స్‌ లో పడుతుంది. ఈ వ్యూహంతోనే జగన్‌ చాలా కామ్‌ గా కూల్‌ గా ఉన్నట్లు సమాచారం. అన్నింటికి మించి  డేటా వార్‌ తో వైసీపీకి ఇప్పుడు మైలేజ్‌ మొదలైంది. ఇలాంటి టైమ్‌ లో టిక్కెట్ల గొడవల మొదలైతే. దీన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు  ఉన్నాయి. అందుకే.. జగన్‌ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించాడు.   
Tags:    

Similar News