చెలామణీలో ఉన్న పేర్లను మార్చేసి.. కొత్త పేర్లు పెట్టేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం.. శతాబ్దాల క్రితం ఊళ్ల పేర్లను మార్చేయటం.. ఇప్పుడేమో.. పాత పేర్లను పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనికి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. రాజమండ్రికి గతంలో ఉన్న రాజమహేంద్రపురం పేరును బాబుహయాంలో మార్చటం తెలిసిందే.
పాత పేర్లు తీసేసి.. కొత్త పేర్ల కారణంగా భావోద్వేగం పరంగా కొన్ని వర్గాలకు ఓకే అయినా.. మొత్తంగా చూస్తే ఇబ్బందులు తప్పవని చెప్పక తప్పదు. నలభైఏళ్లు మిమ్మల్ని ఒక పేరుతో పిలచే వారికి.. మీరు హటాత్తుగా పేరు మార్చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు ప్రముఖులైతే మీ పేరును మొత్తంగా మార్చేసుకుంటే ఉండే తిప్పలు అన్ని ఇన్ని కావు.
వ్యక్తిపేరు మారితేనే ఇన్ని తిప్పలు ఉంటే.. ఊళ్ల పేర్లు మారితే ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు. అయినప్పటికీ.. భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తెచ్చేసిన ఊళ్ల పేర్లను మార్చేసే ప్రక్రియ ఈ మధ్యన జోరుగా సాగుతోంది. తాజాగా ఆగ్రా కూడా ఇదే వరుసలోకి వచ్చింది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహాల్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆగ్రా పేరు మార్చాలన్న అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ నగరానికి పెట్టే పేరు అంశం మీద భారీ కసరత్తు సాగుతోంది. డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పు మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది.
ఆగ్రాకు ఒకప్పుడు అగ్రవాన్ అని.. అగ్రబాణ్ అని వ్యవహరించేవారని చెబుతున్నారు. అంతేకాదు.. ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చింది? అన్న అంశం మీదా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ వర్సిటీ హిస్టరీ శాఖకు చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ అంచనా ప్రకారం ఆగ్రాకు మొదట్లో అగ్రవాన్ అనే పేరు ఉందని.. తర్వాతి కాలంలో దీని పేరు ఆగ్రాగా మారిందంటున్నారు. అయితే.. ఈ విషయాల్ని తెలియజేసే సాక్ష్యాల్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. చూస్తుంటే.. సమీప భవిష్యత్తులో ఆగ్రా పేరు మారనుందన్న మాట.