చంద్రుడిపై మొక్కల పెంపకం..: ఎప్పుడంటే..?

Update: 2022-10-07 06:23 GMT
భూమికి అతి సమీపంలో ఉన్న సహజ గ్రహం చంద్రుడు. భూ కక్ష్యకు, స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తాడు. అందుకే చంద్రుడిని మామ(చందమామ) అనే గ్రహంగా పిలుచుకుంటాం.  అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మానవ శైలి. ఇందులో భాగంగా ఇప్పటికే చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. భారత్ కూడా అందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రుడిపై ఉండే వాతావరణాన్ని భట్టి అక్కడ మొక్కలు పెంచవచ్చని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లాంట్ బయాలజిస్ట్ బ్రెట్ విలయ్స్ 2025 నాటికి చంద్రుడిపై వ్యవసాయం చేయొచ్చని అంటున్నారు.

చంద్రుడిపై ఇప్పటికి ఎన్నో పరిశోధనలు జరిగాయి. భవిష్యత్ లో ఈ గ్రహంపై మానవుని మనుగడ కూడా ఉండొచ్చని కొందరు అంటున్నారు. మానవుడి మనుగడ సాధించే గ్రహాల్లో చంద్రుడితో పాటు అంగారక గ్రహం కూడా ఉంది. కానీ చంద్రుడిపై వెళ్లడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఆసక్తిని రేపుతున్నాయి.

చంద్రుడిపై 2025 నాటికి మొక్కలు పెంచాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇజ్రాయిలీ ప్రైవేట్ మూన్ మిషన్ బెరెషీట్ 2 స్పేస్ క్రాప్ట్ ద్వారా విత్తనాలను చంద్రుడిపైకి పంచాలని చూస్తున్నారు.

చంద్రుడిపైకి విత్తనాలు తీసుకెల్లిన తరువాత ముందుగా ల్యాండింగ్ అవుతారు. ఆ తరువాత సీల్ చేసిన ఓ ప్రత్యేక గదిలో మొక్కలను పెంచుతారు. విపరీత పరిస్థితులను ఈ మొక్కలు ఎలా తట్టుకోగలవు...? ఎంత త్వరగా మొలకెత్తుతాయనే విషయాలు శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు.

అయితే ఇక్కడికి ఆస్ట్రేలియాకు చెందిన ఓ గడ్డి జాతి మొక్కను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మొక్క నీరులేని చోట కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆహారం, ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రారంభ దశ అన్నీ రెడీ చేసుకుంటారు. ఈ పరిశోధన  ముందు ముందు కాలాల్లో చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతాయని అంటున్నారు.

చంద్రుడిపై మూడు దశాబ్దాలుగా ప్రయోగాలు సాగుతున్నాయి. అక్కడికి వెళ్లొచ్చిన మానవుడు అక్కడి మట్టిని భూమిపైకి తీసుకొచ్చాడు. ఈ మట్టిలో ఏదైనా విషయం ఉందా..? అనే ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ మట్టిపై తొలిసారి మొక్కలను పెంచారు. కేవలం 12 గ్రాముల మట్టిలో మొక్కలను విజయవంతంగా పెంచారు. అవాల తరహాలోని అరబిడోప్సిన్ థలియానా రకం మొక్కలను పెంచారు. ఈ విత్తనాలు యూరఫ్ -ఆసియా, ఆప్రికాలో ఉంటాయి. ఇవి ఆవగింజలు, కాలిఫ్లవర్ తరహాకు చెందినవి. ఇవి చాలా తేలికగా పెరగడమే మాత్రమే కాకుండా విస్త్రుతంగా పరిశోధనలకు ఉపయోగపడుతాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News