అవి వచ్చేస్తే.. గ్యాస్ సిలిండర్ పేలినా నో డేంజర్

Update: 2017-05-04 08:12 GMT
పెద్దగా పట్టించుకోం కానీ వంటగ్యాస్ రాకతో దేశంలో మహిళల స్థితిగతుల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది.  వారి ఆరోగ్యాల్లో.. టైం ఆదా కావడంలో ఎంతో బెటర్మెంట్ వచ్చింది. కానీ.. వంట గ్యాస్ వల్ల ప్రమాదాలూ జరుగుతుండడం మాత్రం ఆందోళనకరమే. అయితే.. ఇక నుంచి ఇళ్లలో చాలావరకు ప్రమాదకరం కాని గ్యాస్ సిలిండర్లు రానున్నాయి.
    
ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్లతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది పేలి మన ప్రాణాలు తీస్తుంది. దీనికి కారణం గ్యాస్‌ సిలిండర్లు బలమైన ఉక్కుతో తయారైనవి కావడం. వాటి స్థానంలో ప్లాస్టిక్‌ సిలిండర్లు వస్తే…. ఏదైనా ప్రమాదం జరిగినా సిలిండర్‌ పేలకుండా గ్యాస్‌ మాత్రమే లీక్‌ అయితే? ప్రమాదాన్ని పసిగట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రాణాలను రక్షించుకోవచ్చు.
    
విదేశాల్లో ఇప్పటికే ఉన్న ఇలాంటివి మనదేశంలో కూడా బెంగుళూరులోని ఇండో గ్యాస్‌ కంపెనీ  తయారు చేసింది. వాణిజ్యపరంగా ఈ సిలిండర్లను గుజరాత్‌ లో వేరొక కంపెనీ తయారుచేస్తుంది. వీటిని వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా ప్రభుత్వ ఎల్‌ పీజీ సంస్థలను కోరుతూ ఈ కంపెనీ తయారుచేసిన ప్లాస్టిక్‌ సిలిండర్లను అందజేసింది. వాటిని పరీక్షించి, అంగీకరిస్తే ఈ తరహా ప్లాస్టిక్‌ సిలిండర్లను పెద్దమొత్తంలో తయారుచేసి గ్యాస్‌ కంపెనీలకు అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. ప్రభుత్వ ఎల్‌పీజీ సంస్థలు, ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో మన ఇళ్లలో ఈ ప్లాస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు దర్శనమివ్వనున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News