కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. కరోనా వైరస్ దెబ్బకు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో మొదలైన ఈ కరోనా దండయాత్ర, ప్రపంచంలోని అన్ని దేశాలు చూట్టేసింది. ఇక మరోవైపు ఈ కరోనా వెలుగులోకి వచ్చిన మొదట్లో దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో పలు దేశాలు దీనిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత వ్యాక్సిన్ వచ్చినా రెండో వేవ్ , కరోనా వ్యాప్తి అంటూ లాక్ డౌన్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సడలింపులతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంకా కరోనా భయం పూర్తిగా తొలగిపోకపోవడంతో ప్రజలందరూ ఇళ్లకు పరిమితం అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే విద్యార్థులు ఇప్పుడు తమ క్లాస్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఆన్‌లైన్ బాట పట్టారు. స్కూల్ లో క్లాస్ రూమ్ కు హాజరైనట్లుగా తమ గదిలోకి వెళ్లి ల్యాప్‌టాప్ ముందు కూర్చుని బుద్ధిగా క్లాస్‌కు హాజరవుతున్నారు విద్యార్థులు.
అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు కొన్ని చోట్ల సమస్యాత్మకంగా మారుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల కళాశాల నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతుల్లో అపశ్రుతి జరిగింది. మహారాష్ట్రలోని ముంబైనగరంలోని విల్లాపార్లేలోని ఓ కళాశాల నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతి లో ఒక్కసారిగా అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. ఆన్ లైన్ తరగతిలో అశ్లీల వీడియో కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు షాక్ కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ లైన్ తరగతి లో అశ్లీల వీడియోను ప్రదర్శించారని కళాశాల ప్రొఫెసర్ జుహు పోలీసులకు తెలిపారు. దీంతో జుహు పోలీసులు ఐపీసీ, ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆన్ లైన్ తరగతిలో అశ్లీల వీడియోను ప్రదర్శించిన వారెవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు వెల్లడించారు.