ప్లేబాయ్ మ్యాగజీన్. ఇపుడంటే మనకు కాస్త తక్కువే తెలుసు కానీ ఒకప్పుడు ఈ పత్రిక కోసం నిద్రాహారాలు మానుకొని మరీ ఎదురుచూసేవారు. ఎందుకు అంత క్రేజ్ అంటే...హాట్ హాట్ న్యూడ్ ఫోటోలకు ప్లేబాయ్ మ్యాగ్జిన్ ఫేమస్ మరి! అలాంటి ప్లేబాయ్ పత్రికను అమ్మకానికి పెట్టనున్నారు. ప్లేబాయ్ కంపెనీ ఇటీవల డిజిటల్ మీడియాపై దృష్టి పెట్టింది. ఆ కారణంగా ప్లేబాయ్ మ్యాగ్జిన్ లో నగ్న చిత్రాలను ప్రచురించడం నిలిపేశారు. అయితే విస్తృతంగా ఆన్ లైన్ లో 'అన్నీ' దొరుకుతున్న నేపథ్యంలో ప్లేబాయ్ కి ఒకింత ఆదరణ తగ్గిందనే చెప్పొచ్చు.
దీంతో ఏకంగా పత్రికనే అమ్మేందుకు ప్లేబాయ్ ఓనర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్లేబాయ్ ఎంటర్ ప్రైజ్ ను సుమారు 500 మిలియన్ డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ లో ఉన్న ప్లేబాయ్ భవనాన్ని 200 మిలియన్ డాలర్లకు అమ్మాలని నిర్ణయించారు. ప్లేబాయ్ మ్యాగ్జిన్ ను 1953లో హగ్ హెఫ్నర్ స్థాపించారు. టెక్నాలజీతో మసాల ఫొటోలు అందుబాటులోకి రాకముందు వరకు ప్లేబాయ్ ఒక్కటే 'అలాంటి' బొమ్మలకు పెట్టింది పేరు!