ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల వారిని ఉర్రూతలూగించి శృంగార వారపత్రిక ప్లేబాయ్ కొత్తగా తెరమీదకు వస్తోంది. నగ్న చిత్రాలకు గత ఏడాది స్వస్తి పలికిన ప్లేబాయ్ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. ప్లేబాయ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కూపర్ హెప్నర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్లేబాయ్ నుంచి నగ్న చిత్రాలను తొలిగించడం పెద్ద తప్పు అని ఆయన అభిప్రాయపడ్డాడు. తమ ఐడెంటీని మళ్లీ వెనక్కి తీసుకుంటున్నామని త్వరలో మళ్లీ మ్యాగ్జిన్‌లో నగ్న చిత్రాలు దర్శనమివ్వనున్నాయని ఆయన ట్వీట్ చేశాడు. మార్చి-ఏప్రిల్ నెలకు సంబంధించిన మ్యాగ్జిన్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన కూడా జారీ చేశారు. కాగా, ప్లేబాయ్ మ్యాగ్జిన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని కొందరు ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా మొదట అచ్చు రూపంలో వచ్చిన ప్లేబాయ్ గత ఏడాది ఆపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి ప్రవేశించింది. మారుతున్న కాలానికి తగినట్టుగా కొత్తతరం పాఠకులను ఆకర్షించేందుకు సరికొత్త సాంకేతికతను ప్లేబాయ్ అందిపుచ్చుకుంది. ప్లేబాయ్‌కు బ్రాండ్ పరంగా సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నామని, అందుకే శక్తిమంతమైన సంప్రదాయ, డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫాంపై తమ సంస్థ వ్యవహారాలను పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించామని ప్లేబాయ్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత, కొత్త పాఠకులకు తమ సాహిత్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, అందుకే ఐట్యూన్స్, గూగుల్ ప్లే స్టోర్స్‌లో యాప్ సేవలను అందించాలని నిర్ణయించామన్నారు.
శృంగార, నగ్న చిత్రాలతో 1950లో తొలిసారి ప్రచురణను ప్రారంభించి ప్లేబాయ్ సంచలనం రేపింది. సాంకేతిక ప్రపంచంలో పోటీని తట్టుకొనేందుకు కొత్త హంగులు, డిజైన్‌లో 2016 మార్చి సంచికను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే సాంకేతిక పోటీ పెద్ద ఎత్తున ఎదురవుతున్న నేపథ్యంలో ప్లే స్టేర్‌లో తమ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్లేబాయ్ సిద్దమైంది. తాజాగా నగ్న చిత్రాలను తిరిగి ప్రచురించేందుకు ఓకే చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/