హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో శుక్రవారం రాత్రి ఓ విషాద ఘటన జరిగింది. నిన్న రాత్రి నిర్వహించిన బంగారు తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా బౌలింగ్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మరణించిన ఘటన సంచలనం రేపింది. రోడ్ నం.10లోని జహీరానగర్ లో ఉన్న ఖాళీ స్థలంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆంథోని(23) అనే యువకుడు బౌలింగ్ వేస్తున్నాడు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆంథోనీ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన తోటి ఆటగాళ్లు ఆంథోనీని హుటాహుటిన సమీపంలోని ఆసుత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంథోనీ కొద్దిసేపటి తర్వాత మృతి చెందాడు. అయితే, హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో....ఆంథోనీ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంథోనీ హోటల్ మేనేజ్ మెంట్ చేస్తూ - ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ కూడా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరితో కలివిడిగా ఉండే ఆంథోనీ మృతితో అతడి స్నేహితులు - కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చేతికందివచ్చిన చెట్టంత కన్న కొడుకు అకాలమరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Full View