క్రికెట్‌లో గెలిచినందుకు ఆవుదూడ‌లు గిఫ్ట్‌

Update: 2017-06-05 04:53 GMT
సాధార‌ణంగా పోటీల్లో గెలిస్తే....క్రికెట్ టోర్నీల్లో రాణిస్తే నగదు బహుమతి లేదా జ్ఞాపికను అందిస్తారు. కానీ గుజరాత్‌ లోని వడోదరలో మాత్రం క్రికెట్ టోర్నీని కైవసం చేసుకున్న జట్టులోని ఒక్కో సభ్యుడికి దూడను ప్రదానం చేశారు. మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్‌ గా ఎంపికైన ఆటగాడికి ఆవును అందజేశారు. ఈ వార్త మిగ‌తా ప్ర‌పంచానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ గుజ‌రాతీలు మాత్రం ఇందులో ప్ర‌త్యేక‌త ఏం లేదంటున్నారు.

గోసంరక్షణపై మరింత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వడోదరలోని రాబరి వర్గానికి చెందిన టోర్నీ నిర్వాహకులు తెలిపారు. రాబరి కులస్థులు పశు సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. సమాజంలో గోవు అత్యంత ప్రాధాన్యమైనదని టోర్నీ ద్వారా సందేశం పంపాలనుకున్నామని నిర్వాహకుడు ప్రకాశ్ రాబరి తెలిపారు. ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అప్పుడే వాటిని రక్షించుకోగలమని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News