కేజ్రీవాల్ పార్టీ వద్దకాసుల లేమికి అదే కారణమా?!

Update: 2015-07-15 06:08 GMT
ఢిల్లీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తీరు ఎలా ఉంది? ప్రజల్లో ఈ పార్టీ ఇమేజ్ పెరిగిందా తరిగిందా? భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సంచలనాత్మక విజయం సాధించిన ఈ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దేశ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానగణాన్ని కలిగిన ఈ పార్టీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిందా పెరిగిందా? అనేది అంతుబట్టని విషయంగానే మారింది. ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికలూ లేవు.. ఆప్  పట్ల ప్రజాతీర్పు వచ్చేదీ లేదు.. కాబట్టి ఆ పార్టీ కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ అంతుబట్టనిదిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీద అరుపులు అరుస్తోంది. ఖజానా ఖాళీ అయిపోయిందని.. దాతలు ముందుకు రావాలని.. విరాళాలు ఇవ్వాలని.. ఆర్థికంగా సత్తువ అందించాలని కేజ్రీవాల్ కోరుతున్నాడు. మరి ఆప్ కు ఇలా డబ్బుల కొరత రావడం కొత్త కాదు. దాని ప్రస్థానంలో ఇప్పటికే పలు మార్లు ఇలా జరిగింది. తాము అధికారంలో ఉన్నా విరాళాలు అడుగుతున్నామని.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం లేదని..ఇలా విరాళాలు అడగడమే తమ నిజాయితీకి నిదర్శనం అని కూడా కేజ్రీవాల్ చెప్పుకొంటూ ఉన్నాడు.

మరి ఆప్ అధినేత ఇలా చెబుతున్నప్పటికీ.. విమర్శకులు మాత్రం మండి పడుతున్నారు. ఆప్ పై జనాలకు నమ్మకం పోయిందని. .అందుకే దానికి విరాళాలు రావడం లేదని.. ఆప్ కు క్రేజ్ ఉన్న రోజుల్లో విరాళాలు బాగా వచ్చాయని..  కేజ్రీవాల్ పార్టీ అసలు రూపం అర్థమయ్యే సరికి ఇప్పుడు ఆ పార్టీకి విరాళాలు రావడం లేదని.. వారు అంటున్నారు. ఇవన్నీ కానివారి మాటలే అని చెప్పాలి!
Tags:    

Similar News