ఏడాదిన్నరలోనే బక్కచిక్కిపోయిన మోడీ

Update: 2016-01-22 09:39 GMT
ప్రధాని నరేంద్రమోడీ ఆ పదవి చేపట్టిన తరువాత బాగా సన్నబడిపోయారా...? ఆయన ఛాతీ ఆరు అంగుళాల కంటే ఎక్కువగా తగ్గిపోయిందా? అంటే అవుననే అంటున్నారు ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీ నేతలు - కార్యకర్తలు. డాక్టర్ లో - ప్రధాని సన్నిహితులో - వ్యక్తిగత సహాయకులో చెప్పాల్సిన మాటను సమాజ్ వాది నాయకులు చెప్పడం ఏంటనుకుంటున్నారా? దానికి చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది.
    
ప్రధాని నరేంద్ర మోడీ చాతి వెడల్పు ఎంత అనే అంశంపై ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ని బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్శిటీ కాన్వొకేషన్ కు మోడీ హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బంగారు రంగు డ్రెస్ ను అదికారులు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చాతి వెడల్పు ఎంత అన్న మీమాంస ఏర్పడింది.దాని పై ప్రధాని కార్యాలయాన్ని వారు సంప్రదించారు. మోడీ చాతి వెడల్పు ఏబై అంగుళాలని, భుజాల వద్ద 21 అంగుళాలని అదికారులు తెలియచేశారు.  అయితే .. అక్కడే పెద్ద మెలిక పడింది.  2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కి, సమాజవాది పార్టీ అదినేత మూలాయం సింగ్ యాదవ్ కు మద్య మాటల యుద్దం జరిగింది.మూలాయం చేసిన వ్యాఖ్యలకు మోడీ సమాధానం ఇస్తూ ఉత్తరప్రదేశ్ లో మరో గుజరాత్ కావాలంటే ఏభై ఆరు అంగుళాల చాతి కావాలని వ్యాఖ్యానించారు.దాంతో ఆయన చాతి వెడల్పు ఏభై ఆరు అంగుళాలని అనుకున్నారు. కాని ఇప్పుడు ఏబై అంగుళాలని అదికారులు సమాచారం ఇచ్చారు. అంటే అప్పుడు మాటవరసకు ఏభై ఆరు అంగుళాలని అప్పట్లో అన్నారా.. లేదంటే ప్రధాని బాగా సన్నబడిపోయారా అని సమాజ్ వాది పార్టీ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News