స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైనట్లే. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి మోడీ స్పీడ్ ను ఎవరూ అందుకోలేకపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో.. విపక్షాలకు ఊపిరి పీల్చుకోలేనట్లుగా ఆయన చేస్తున్నారు.
ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న బిల్లుల్ని ఎలా తేల్చేయాలన్న విషయంపై కొత్త తరహా పాఠాల్ని పార్టీలకు నేర్పుతున్నారని చెప్పాలి. వరుస పెట్టి ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం లాంటి వాటితో పాటు.. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలకు తెర తీస్తున్నట్లుగా ఆయన తీరుచూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఒక దేశం.. ఒక ఎన్నికలంటూ చేసిన నినాదంతో ఒక విషయం ఇట్టే అర్థమైపోతుంది. గడిచిన కొద్ది కాలంగా జమిలి ఎన్నికల మీద కసరత్తు చేస్తున్న మోడీ సర్కారు.. తాజాగా ఎర్రకోట నుంచి ఇచ్చిన నినాదంతో ఎన్నికలకు రెఢీ అవుతున్నట్లుగా చెప్పక తప్పదు.
దేశ వ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ.. పార్లమెంటు ఎన్నికల్ని నిర్వహించేలా జమిలిని తెర మీదకు తేవటం తెలిసిందే. దీంతో.. ఐదేళ్లు ప్రభుత్వం ఉండాల్సిన స్థానే.. మరో రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఎన్నికలు జరిగే పరిస్థితి. అదే జరిగితే.. ఐదేళ్ల అధికారం అనుకుంటూ ప్లాన్ చేసిన పార్టీలకు శరాఘాతంగా చెప్పాలి. అదే సమయంలో.. మోడీ పుణ్యమా అని.. కొన్ని విపక్షపార్టీలకు త్వరలో వచ్చే ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయని చెప్పక తప్పదు. జమిలి మీద మోడీ సర్కారు ఎంత సీరియస్ గా ఉందన్న విషయం తాజా ఎర్రకోట ప్రసంగం చెప్పేస్తుందని చెప్పాలి.