జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపించారు. శ్రీనగర్ లో జరిగిన బీజేపీ-పీడీపి ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ కు రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జమ్ము కాశ్మీర్ లో గత ఏడాది సంభవించిన వరదలు తనకెంతో బాధ కలిగించాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తన జన్మదినం రోజున తన తల్లి 5 లేదా 11రూపాయిలు ఇచ్చేదని గత ఏడాది మాత్రం 5 వేలు ఇచ్చి వరద బాధితులకు అందజేయాలని చెప్పిందని ఆయన అన్నారు.
ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి కాశ్మీర్‌కు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ... జమ్ము కాశ్మీర్ కు దీపావళి కానుకగా రూ.80,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీతో రాష్ట్రం దశాదిశా మారుతాయని ఆశిస్తున్నామని మోడీ చెప్పారు. కేవలం 80 వేల కోట్ల ప్యాకేజీతో ఆగిపోమని, ఇంకా సహాయమందిస్తామని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రులతో, స్నేహితులతో సరదాగా దీపావళి పండుగను చేసుకోవచ్చు కానీ, రాబోయే తాను జమ్ము కాశ్మీర్ రావాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు .మోడీ పర్యటన సందర్భంగా శ్రీనగర్ లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.