అందరి ఇంటిపేరు మోడీయేనా?

Update: 2016-11-21 05:19 GMT
పేరు మార్చుకునేవారుంటారు.. కానీ - ఇంటిపేరు మార్చుకునేవారిని ఎక్కడైనా చూశారా?. కేవలం అమ్మాయిలకు పెళ్లయ్యాక ఇంటిపేరు మారుతుంది. భర్త ఇంటిపేరు వారికి వస్తుంది. కానీ... అప్పటివరకు ఉన్న వారి విద్యార్హతల రికార్డుల్లో మాత్రం పాత ఇంటిపేరే ఉంటుంది. ఇంటిపేరు అంటే తరతరాలుగా వచ్చే గుర్తింపు. ఆ కుటుంబానికి, వంశానికి అది టైటిల్... అలాంటి ఇంటిపేరును పెళ్లయిన ఆడవాళ్లకు తప్ప ఇంకెవరికీ మారిన సందర్భాలు ఉండవు... మార్చుకోవాలనుకునేవారూ కనిపించరు. అలాంటిది... ఒక కులస్థులందరికీ ఇంటిపేరు మార్చుకోమంటే ఏమంటారు.. ఒక్కరు కూడా సరే అనరు. ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీకి అదే అనుభవం ఎదురైంది. ఆయన అతి తెలివితో చేసిన ప్రతిపాదనకు అంతా అభ్యంతరం చెప్పారు.
    
భోపాల్ లో ఆదివారం తేలి కులస్థుల అఖిల భారత సమావేశం జరిగింది. తేలి - సాహు వంటి వేర్వేరు పేర్లున్నా ఈ కులస్థుల ప్రధాన వృత్తి నూనె తీయడం. ప్రధాని మోడీ కూడా అదే వర్గానికి చెందినవారు. దీంతో ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీని ఆ సమావేశానికి పిలిచారు. అక్కడ ప్రహ్లాద్ తన కులస్థులకు విచిత్రమైన ప్రతిపాదన చేశారు. తేలి కులస్థుడైన మోడీ దేశానికి గర్వకారణంగా నిలిచినందుకు గాను తేలి వర్గీయులంతా మోడీ అన్న పదాన్ని తమ పేరు ముందు చేర్చుకుని దాన్ని ఇంటిపేరు చేసుకోవాలని సూచించారు.  అయితే వారు త‌మ పేరుకు ముందు మోడీని చేర్చుకునేందుకు ఇష్టప‌డ‌లేదు. కొందరు కామ్ గా ఉన్నా కొందరు మాత్రం అదెలా కుదురుతుందంటూ అక్కడే వ్యాఖ్యానించడం విశేషం. ప్రహ్లాద్ తిక్కతిక్కగా మాట్లాడే రకమన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News