ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ సడెన్ గా వాయిదా? ఏమైంది.? కారణమేంటి?

Update: 2023-01-11 07:52 GMT
తెలంగాణపై దండయాత్ర చేపట్టిన బీజేపీ బ్యాచ్ అందకు సంసిద్ధమవుతూ జనవరిలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలు పెట్టుకుంది. తెలంగాణలో రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు జనవరి 19న మోడీ స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని బీజేపీ నేతలు జబ్బలు చరిచారు. ఇందులో సికింద్రాబాద్ లో 'వందేభారత్' రైలును కూడా మోడీ ప్రారంభించాల్సి ఉంది. అయితే సడెన్ గా ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదాపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రధాన మంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది.

మోడీ పర్యటనలో దాదాపు 5 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని డిసైడ్ అయ్యారు. మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగసభ కూడా ఉంది. ప్రధాని పర్యటనలో 7వేల కోట్ల పనులున్నాయి. ఇంతటి కీలక పర్యటన వాయిదా పడడం వెనుక కారణాలపై ఆరాతీస్తున్నారు.

మోడీ -షాలు తెలంగాణపై ఫోకస్ చేసి ఇక్కడ కేసీఆర్ ను గద్దె దించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరి పర్యటనలు ఫిక్స్ అయ్యాయి. అయితే మోడీ షెడ్యూల్ లో మార్పుల కారణంగా వాయిదా పడినట్లు సమాచారం. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్ ను తెలియజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ హైస్పీడు రైలుతోపాటు.. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య 85 కి.మీల మేర డబ్లింగ్ రైల్వే లైన్ మోడీ ప్రారంభించాల్సి ఉంది. ఐఐటీ హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులు, భవనాలను మోడీ ప్రారంభించాల్సి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.699 కోట్ల వ్యయంతో రీడెవలప్ మెంట్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దానికి సంబంధించిన పనులకూ మోడీ  శంకుస్థాపన చేయాల్సి ఉంది.

అయితే సడెన్ గా టూర్ వాయిదా వెనుక కారణాలు ఏంటని తెలియడం రావడం లేదు. టూర్ ఉంటుందని రీషెడ్యూల్ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ తో ఫైటింగ్ వేళ వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళతాయి. మరి మోడీ ఈ విషయంలో ఎలా ముందుకెళతాడన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News