ఊహించని రీతిలో ఉద్రిక్తతల వేళ లద్దాఖ్ కు వెళ్లిన మోడీ

Update: 2020-07-03 06:00 GMT
రోటీన్ కు భిన్నంగా.. ఊహించని విధంగా నాటకీయ పరిణామాల్ని నేర్పుగా.. తనకు తనకు అనుకూలంగా మలుచుకోవటంలో ప్రధాని నరేంద్ర మోడీకి మించినోళ్లు లేరనే చెప్పాలి. ఓవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా పెరగటమే కాదు.. మరణాల సంఖ్య పెరుగుతూ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రికత్తల వేళ.. ఆయన లద్దాఖ్ కు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.

సైనిక బలగాల్లో నైతికస్థైర్యం పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి లద్ధాఖ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగి.. ఇరు వర్గాలు సరిహద్దుల్లో బలగాలు మొహరిస్తున్న వేళ.. దేశ ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ ఆకస్మికంగా సరిహద్దులకు వెళ్లటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.

ప్రధాని మోడీతో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్.. ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి లద్దాఖ్ కు వెళ్లారు. నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అక్కడి వివరాలు అందజేశారు. ఈ హరీందర్ సింగే.. భారత సైన్యం తరఫున చైనాతో చర్చలు జరుపుతున్నారు. సరిహద్దుల్లో సైన్యంతో నేరుగా మాట్లాడిన ప్రధాని.. అనంతరం లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని మోడీ పరామర్శించనున్నారు. తాజా పర్యటనతో మోడీని కీర్తించే ఆయన వర్గీయులు.. నమో దేశభక్తిని పెద్ద ఎత్తున కీర్తించటం షురూ చేయటం ఖాయం.
Tags:    

Similar News