మోడీ చెప్పిన బిలాల్ దార్ ఎవ‌రు?

Update: 2017-09-25 05:00 GMT
మాట‌ల‌తో దేశ ప్ర‌జ‌ల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసే ప్ర‌ధాని మోడీ మ‌రోసారి త‌న మార్క్ ప్ర‌సంగాన్ని మ‌న్ కీ బాత్ రూపంలో అందించారు. మోడీ మాన‌స‌పుత్రిక అయిన మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టి మూడేళ్లు అవుతోంది. ఇంత‌వ‌ర‌కూ 35 సార్లు ప్రసంగించిన ఆయ‌న‌.. త‌న తాజా ప్ర‌సంగంలో ఎప్ప‌టి మాదిరే ఇద్ద‌రిప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. వారిలో ఒక‌రు బిలాల్ దార్‌.

మోడీ ప్ర‌స్తావించే వ‌ర‌కూ బిలాల్ దార్ పేరు చాలామందికి తెలీదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే జ‌మ్మూ క‌శ్మీర్ రాష్ట్రంలోనూ తెలీదు. అలాంటిది మోడీ మాత్రం ఆయ‌న గురించి.. ఆయ‌న చేసే సేవ గురించి చెప్పుకొచ్చారు. అక్టోబ‌రు 2న జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని.. అందుకు ప‌దిహేను రోజులు ముందుగా పారిశుద్ధ్యంపై ఉద్య‌మాన్ని నిర్వ‌హించాల‌ని కోర‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లువురు ప్ర‌ముఖుల‌కు స్వ‌యంగా లేఖ రాశారు.

ఇదిలా ఉంటే.. ఒక పారిశుద్ధం ప‌నిని చేసే బిలాల్ దార్ అనే వ్య‌క్తిని  శ్రీన‌గ‌ర్ పుర‌పాల సంఘం స్వ‌చ్చ‌త రాయ‌బారిగా నియ‌మించారు. ఆయ‌న‌కు ఆ అవ‌కాశం ఎలా ల‌భించింద‌న్న విష‌యాన్ని చూస్తే.. గ‌డిచిన ఐదారేళ్లుగా బిలాల్ దార్ త‌న సొంతంగానే పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు. శ్రీన‌గ‌ర్ లోని స‌ర‌స్సులో ప‌డేస్తున్న నీళ్ల సీసాలు.. ఇత‌ర‌ప్లాస్టిక్ సామాగ్రిని సొంతం తొల‌గిస్తున్నార‌ని.. అందుకే ఆయ‌న్ను అంబాసిడ‌ర్ గా నియ‌మించిన‌ట్లు చెప్పారు. రాయ‌బారులు అంటే కేవ‌లం సినీ.. క్రీడాకారులే కావాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న నిరూపించార‌న్నారు.

బిలాల్ దార్ తో పాటు స్వాతి అనే మ‌హిళ గురించి కూడా మోడీ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇంత‌కీ ఎవ‌రీ స్వాతి అంటే.. అమ‌రులైన క‌ల్న‌ల్ సంతోష్ మ‌హాదిక్ స‌తీమ‌ణి. దేశ ర‌క్ష‌ణలో భాగంగా ప్రాణాలు విడిచిన ఈ క‌ల్న‌ల్ స‌తీమ‌ణి తాజాగా సైన్యంలో చేరాన‌ని.. త‌ద్వారా దేశ‌ప్ర‌జ‌ల్లో స‌రికొత్త స్ఫూర్తిని నింపిన‌ట్లుగా మోడీ వ్యాఖ్యానించారు. అక్టోబ‌రులో మ‌హాత్మాగాంధీ.. స‌ర్దార్ ప‌టేల్‌.. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి.. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్‌.. నానాజీ దేశ్ ముఖ్.. దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్‌ లాంటి ప్ర‌ముఖులు జ‌న్మించార‌ని.. వారిని స్మ‌రించుకుందామ‌న్నారు. గాంధీ.. జ‌య‌ప్ర‌కాశ్‌.. దీన ద‌యాళ్ ఉపాధ్యాయ్ లాంటి వారు అధికారానికి చాలా దూరంగా ఉన్నార‌న్నారు.
Tags:    

Similar News