నరేంద్రమోడీ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ప్రధానిగా గెలువగానే బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు . వాళ్లు సొంత పార్టీ నేతలే కావడంతో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ తాజాగా మంగళవారం కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అందరికీ షాకిచ్చాడు ప్రధాని మోడీ..
సహజంగా మొన్నటి ఎన్నికల వేళ దేశంలో హంగ్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోయాయి. అదే జరిగితే అందరికీ ఆమోదయోగ్యుడైన మాజీ రాష్ట్రపతి సీనియర్ అయిన ప్రణబ్ ను ప్రధాని చేయాలని బీజేపీ కూడా యోచించింది. మోడీపై వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకుంటే ఈయననే ప్రధానిని చేద్దామని ఆర్ఎస్ఎస్ కూడా భావించింది. ఇక కాంగ్రెస్ కూడా హంగ్ వస్తే ప్రణబ్ మంత్రం జపించాలనుకుంది. అలాంటి ప్రణబ్ ఎన్నికల తర్వాత డమ్మీ అయిపోయారు. మోడీ ఏకపక్షంగా ప్రధాని అయిపోయాడు..
కానీ హంగ్ లో బీజేపీకి అవసరమైన ప్రణబ్ ను మోడీ తక్కువ చేయలేదు. తాజాగా మంగళవారం ప్రణబ్ ఇంటికి స్వయంగా వెళ్లారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రణబ్ ఆశీర్వాదాలను మోడీ తీసుకున్నారు. మోడీ నినాదమైన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సాకారం కావాలని ప్రణబ్ ఆకాంక్షించారు.
ఇక మోడీ కూడా దేశంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ రాజనీతిజ్ఞడిగా అభివర్ణించారు. ప్రణబ్ దాదాను ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమై అనుభూతిని కలిగిస్తోందన్నారు. దీనిపై మోడీ, ప్రణబ్ ట్వీట్ చేసి ఒకరినొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇలా కాంగ్రెస్ పెద్దను సైతం తన మేజిక్ తో కదిలించాడు మోడీ.