కరోనా మహమ్మారి కోరలు చాచి ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న దేశాలు మొదలుకొని అరకొర వైద్య సదుపాయాలున్న దేశాల వరకు అన్నీ కరోనా దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్ ఒక్కటే మార్గమని...అందుకే కరోనా కోరలు బలహీనపడేవరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని భారత్ తో పాటు పలు దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇక, 135 కోట్ల జనాభా ఉన్న భారత్ వంటి పెద్ద దేశంలో సామాజిక దూరం పాటించడం చాలా అవసరమని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కొంచెం కఠినంగా ఉన్నా 21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ కాక తప్పదని చెప్పారు. చెప్పడమే కాదు....స్వయంగా తాను కూడా సోషల్ డిస్టెన్స్ ను పాటించి చూపుతున్నారు ప్రధాని మోడీ. తాజాగా లాక్ డౌన్ తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సామాజిక దూరాన్ని పాటించి దేశ ప్రజలకు రోల్ మోడల్ గా నిలిచారు. తాను మాటల ప్రధానిని కాదని...చేతల ప్రధాని అని మోడీ మరోసారి నిరూపించారు.
ప్రస్తుతం భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను చాలా కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అనవసరంగా రోడ్లమీదకు వచ్చేవారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు. ఇక, లాక్ డౌన్ లో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోడీ తన నివాసంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులంతా కనీసం 3 మీటర్ల దూరంలో కూర్చునేలా ఏర్పాటు చేయించారు ప్రధాని మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ - మంత్రులు సామాజిక దూరం పాటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలాదిమందిని కబళించిన కరోనా బారి నుంచి భారత్ ను రక్షించాలంటే 21 రోజుల పాటు లాక్ డౌన్ తప్పదని ప్రధాని మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ నియత్రించటానికి సామాజిక దూరం అతి పెద్ద మార్గమని మోడీ సూచించారు. ఇక తాజాగా, సామాజిక దూరం సామాన్యులకు మాత్రమే కాదని....అందరికీ వర్తిస్తుందని మోడ స్వయంగా నిరూపించారు. రోగులకు మాత్రమే దూరంగా ఉంటే చాలని అనుకునే పౌరులందరికీ మోడీ గట్టి సందేశమిచ్చారు. మరి, ప్రధాని మోడీని చూసైన నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోన్న మన దేశవాసులు లాక్ డౌన్...సామాజిక దూరం కచ్చితంగా పాటిస్తారేమో చూడాలి.