మరో సర్జికల్ స్ట్రైక్స్?.. అంతకు మించా?
ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. మోడీ సర్కారు హయాంలో చివరి పార్లమెంటు సమావేశాలు పూర్తై.న పక్కన రోజున.. దేశ చరిత్రలో ఇప్పటివరకూ కనివిని ఎరుగని ఉగ్రదాడిని చూశాం. పక్కనున్న పాకిస్థాన్ తన కుయుక్తితో సైనికుల ప్రాణాల్ని ఎప్పటికప్పుడు తీరుస్తున్న దుర్మార్గాన్ని ఇప్పటికే చాలాసార్లు చూశాం. తాజాగా చోటు చేసుకున్నది అలాంటిదే.
తాము కానీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదుల్ని ఏరేస్తామని.. రాతి కంటే కఠినమైన సంకల్పంతో వ్యవహరించే తమ లాంటి ప్రభుత్వం హయాంలో పాకిస్థాన్ కు భారత్ సత్తాను చాటటం పక్కా అంటూ చెప్పే మాటల్లో పస లేదన్న విషయం మరోసారి రుజువైంది. 56 అంగుళాల ఛాతీకి అధికారంలోకి వస్తే దాయాదికి చుక్కలు చూపిస్తామన్న మాటల్లో గొప్పలు తప్పించి.. వీర జవానుల కుటుంబాల కన్నీళ్లను.. వారి శోకాన్ని ఆపలేకపోయిందన్నది తాజాగా మరోసారి తేలింది.
రక్తం చిందించిన వీర సైనికుల త్యాగ నిరతిని కీర్తిస్తూ.. వాట్సాప్ లో నాలుగైదు మెసేజ్ లు ఫార్వర్డ్ చేయటం.. అదే అదనుగా జాతీయ భావాలు నిండుగా ఉన్న తమ పార్టీ పాక్ సంగతి చూసుకుంటుందన్న మాటల్ని చెప్పటం.. విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని కడిగేయటం.. రానున్నదంతా సౌండ్ పొల్యూషనే తప్పించి జాతికి జరిగిన నష్టం గురించి నిజాయితీగా వేదన చెందే రాజకీయ పార్టీ కానీ రాజకీయ అధినేత కానీ ఉండే ఛాన్స్ లేదని చెప్పాలి.
మోడీ నాలుగున్నరేళ్ల హయాంలో ఇప్పటికి ఉగ్రఘటనలు పలు చోటు చేసుకున్నా.. గతంతో పోలిస్తే అంటూ మినహాయింపు లెక్కల్ని.. అంకెల్ని గొప్పగా చెప్పుకోవటమే తప్పించి.. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవటంలో ఫెయిల్ అయితే అయ్యారు. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి.. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ ను జాతి కోసం ప్రభుత్వ చర్యగా కంటే కూడా.. మోడీ లాంటోడు కీలక పదవిలో ఉంటే సర్కార్ ఎలాంటి షాకిస్తుందో చూశారా? అంటూ ప్రశ్నల్ని సంధిస్తూ.. జరిగిన దారుణాన్ని రాజకీయ ప్రయోజనంగా మలుచుకునే సీన్ ఒకటి రానున్న రోజుల్లో మరోసారి తెర మీద ఆవిష్కృతం కానుందా?
తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. వారి మీద నిర్లజ్జగా రాజకీయ దాడికి పాల్పడటం.. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వం ఎంత మెరుగైందన్న విషయాన్ని చెప్పే అంకెల ఆసరాను మోడీ సర్కారు తీసుకోవచ్చు. అప్పట్లో గుజరాత్ ఎన్నికల సందర్భంగా.. మోడీ మాష్టారి అస్త్రం ఏంటో తెలుసుగా? తనను చంపటానికి పాక్ తీవ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుందంటూ నిర్లజ్జగా రాజకీయ క్రీడకు తెర తీశారు.
బలమైన భావోద్వేగ ఘటనలకు తగ్గట్లు డైలాగులు పండించి ప్రజల మనసుల్ని దోచేసే మోడీ తాజా ఉదంతంలో ఏం చేయనున్నారన్నది ప్రశ్న. అయితే.. మరో సర్జికల్ స్ట్రైక్స్.. దాని తర్వాత మరో సినిమాకు అనుమతి.. మోడీ సర్కారు గొప్పతనాన్ని డబ్బులు పెట్టి చూసే వినోదం త్వరలో రావటం.. ఈ క్రీడనంతా చూస్తూ.. భారతావని కాలంతో కలిసి అడుగులు వేయటమే తప్పించి.. పాక్ దుర్నీతికి దిమ్మ తిరిగే సమాధానం..అది కూడా నిజాయితీతో జరిగే రిటార్ట్ ను ఎప్పటికి చూస్తామో..?
దేశాల మధ్య వైరం కావొచ్చు.. రాజకీయ క్రీనీడ కావొచ్చు.. మొత్తంగా ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం దేశం కోసం తమను తాము త్యాగం చేసేందుకు సిద్ధమైన అమాయకులేనా? అంతకు మించి ఇంకేమీ ఉండదా? అన్న ప్రశ్న వేదన నిండిన మనసును తొలిచేస్తుంటుంది. దీనికి మోడీ మాష్టారు ఎలాంటి బదులిస్తారో చూడాలి.