యోగా డే నాడు మోడీ మహమ్మారి చిట్కాలు!

Update: 2020-06-21 04:00 GMT
ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారతదేశం ఇప్పుడా ఆ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిస్తూ యోగా చేసి చూపించారు.

మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి యోగా విశిష్టతలను వివరిస్తూ యోగాను చేస్తూ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వైద్యపరమైన యోగా చిట్కాలను ప్రజలకు సూచించారు.

మహమ్మారి వైరస్ బారిన పడి శ్వాసకోస ఇబ్బందులు నివారించడానికి, శ్వాసకోసాన్ని ప్రభావితం చేసే వైరస్ ను అరికట్టడానికి అందరూ యోగా చేయాలని మోడీ సూచించారు. శ్వాస ఇబ్బందులను అధిగమించడానికి యోగా చిట్కాలు బాగా పనిచేస్తాయని ప్రధాని మోడీ వివరించారు. దీని ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చని సూచించారు.

యోగసానాల్లో ప్రాణాయామం ద్వారా శ్వాసకోశ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చని ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. ప్రతీ ఒక్కరూ ప్రాణాయామాన్ని నేర్చుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితుల్లోనూ ప్రాణాయామం వల్ల శారీరకంగా.. మానసికంగా ధృడత్వాన్ని సాధించవచ్చని చెప్పారు. భారతీయులు శతాబ్ధాల కిందటే ప్రాణాయామాన్ని ఆచరించే వారిని చెప్పుకొచ్చారు.

మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలోనే అందరూ ఇంట్లోనే ఉండి మహమ్మారిను నియంత్రించే యోగాసనాలు వేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కల్లోల సమయంలో మానసిక ధృడత్వాన్ని సాధించడానికి యోగా ఉపయోగపడుతుందని మోడీ వివరించారు. వివేకానందుడూ ఇదే చెప్పాడని మోడీ వివరించారు.
Tags:    

Similar News