వారిద్దరూ రెండు దేశాలకు ప్రధానులు. అలాంటి ఆ ఇద్దరిని దిగిపొమ్మనే సాహసం చేయగలరా? అసలు అలాంటి మాట వచ్చే అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్న నోటి నుంచి వస్తుంది. కానీ.. దిగిపొమ్మని చెప్పేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. దానికి ఆ ఇద్దరు ప్రధానులు వ్యవహరించిన వైనం ఆసక్తికరంగా మారింది. అసలు ఇద్దరు ప్రధానుల్ని దిగిపొమ్మని అన్నది ఎవరు? దానికి వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయంలోకి వెళితే..
భారత పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరుగుతున్న వేళ.. ఊహించని రీతిలో జరిగిన ఒక వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జరిగిన పొరపాటును ప్రధాని చాలా తేలిగ్గా తీసుకొని నవ్వేయగా.. అందుకు ప్రతిగా అతిధిగా వచ్చిన బంగ్లా ప్రధాని సైతం అదే తీరులో స్పందించిన వైనం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కీలక ఒప్పందాలు చేసుకున్న అనంతరం.. ఇరువురు ప్రధానుల్ని ఉద్దేశించి కార్యక్రమ వ్యాఖ్యాత.. వారిని స్టేజ్ నుంచి విలేకరుల వద్దకు వెళ్లాల్సిందిగా కోరాల్సి ఉంది. ఇందుకోసం స్టెప్ అవే (step away) అన్న మాట పలకాల్సి ఉంది. అయితే.. ఆ మాట అనటానికి బదులు.. ఇద్దరు ప్రధానులు దిగిపోవాల్సిందిగా (step down) అన్న మాటను పలికారు. వ్యాఖ్యాత నోటి నుంచి వచ్చిన పద ప్రయోగంలో దొర్లిన తప్పును గుర్తించిన ప్రధాని మోడీ వాతావరణాన్ని తేలికపరుస్తూ నవ్వేయగా.. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కూడా ఆయన్ను అనుసరించి నవ్వేశారు. దీంతో.. ఒక నిమిషం పాటు ఇద్దరు ప్రధానులు నవ్వేశారు. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. వ్యాఖ్యాత తప్పు ఇరువురు ప్రధానుల పెదాల మీద చిరునవ్వులు చిందించేలా చేసిన వైనం అందరిని ఆకర్షించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/