హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ పెన్యూర్ సమ్మిట్ రూపంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో తీపికబురు వచ్చింది. జీఈఎస్ సక్సెస్ పై పలు వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతుండగా ఈ జాబితాలో మరో తీపికబురు తెరమీదకు వచ్చింది. జీఈఎస్ నిర్వహణ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. జీఈఎస్ సదస్సును విజయవంతంగా నిర్వహించారని ట్రంప్ ప్రశంసించారు. భారత్-అమెరికా దేశాలు సంయుక్తంగా ముందుకు సాగేందుకు ఈ సదస్సు మరింత ఉపయుక్తంగా ఉందని ఆయన అన్నట్లు సమాచారం. హైదరాబాద్ వేదికగా సాగిన ఈ సదస్సును గ్రాండ్ సక్సెస్ చేశారని ఇవాంకా తనతో వ్యక్తీకరించారని ట్రంప్ ప్రధానితో చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, ట్రంప్-మోడీ ఈ పరిణామం పట్ల తెలంగాణ సర్కారు హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ రాకతో తమకు గుర్తింపు దక్కిందని, తాజాగా ట్రంప్ ఫోన్ కాల్ ద్వారా ఇది మరో సంతోషకరమైన పరిణామమని అంటున్నారు. ఈ పరిణామం తమ సక్సెస్ జాబితాలో చేరుతుందని టీఆర్ ఎస్ వర్గాలు ఖుష్ అవుతున్నాయి. అంతర్జాతీయ యవనికపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేందుకు జీఈఎస్ తోడ్పడిందని అంటున్నారు. ప్రధానంగా టీఆర్ ఎస్ యువనేత - మంత్రి కేటీఆర్ కు గుర్తింపు దక్కేందుకు ఉపయుక్తంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
జీఈఎస్ సదస్సులో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా మంత్రి కేటీఆర్ వదులుకోకుండా తెలంగాణ అనుసరిస్తున్న విధానాల గురించి విపులాత్మకంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాల గురించి వివరించడంలో మంత్రి కేటీఆర్ సఫలం అయ్యారని వివరిస్తున్నారు. మూడు రోజుల కార్యక్రమానికి విచ్చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు - ఫైనాన్స్ సంస్థల మధ్య లావాదేవీలు కుదిరినట్లు సమాచారం. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి, ఒక అమెరికన్ కంపెనీతో డీల్ కుదిరినట్లు సమాచారం.