లాల్ క్రిష్ణ అద్వానీ (ఎల్ కే అద్వానీ).. బహుశా పదేళ్లుగా ఈ పేరు మరుగున పడిపోయిందనుకుంటా... కానీ, అంతకుముందు ఓ యాభై ఏళ్లు ఈ పేరే ఓ సంచలనం.. బీజేపీలో వాజ్ పేయీ అర్జునుడైతే అద్వానీ శ్రీ క్రిష్ణుడు.. వాజ్ పేయీ ఆ పార్టీకి లౌకిక ముఖం అయితే అద్వానీ హిందూత్వ ప్రతినిధి. ఎన్ని విమర్శలు వచ్చినా.. కేసులు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటూ, అవమానాలను తట్టుకుంటూ ముందుకెళ్లిన ధైర్య శాలి అద్వానీ.
ఆ రథయాత్ర.. దేశాన్ని మలుపుతిప్పింది
1990.. అప్పటికే అద్వానీ వయసు 63. రాజకీయాల్లో ఉన్నత పదవులన్నీ చేపట్టాల్సిన వయసు. ఆ వయసులో అద్వానీ సాహసానికి ఒడిగట్టారు. పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేని సమయంలో తనదైన శైలిలో దూకుడు చూపారు. దేశవ్యాప్త రథయాత్రకు శ్రీకారం చుట్టారు.
బిహార్ లో ఈ రథయాత్రను లాలూప్రసాద్ యాదవ్ అడ్డుకోవడం.. అనంతరం కొన్నాళ్లకు బాబ్రీ మసీదు విధ్వంసం.. ఇలా దేశ రాజకీయ చరిత్రను మలుపుతిప్పిన కీలక ఘట్టాలకు అద్వానీ మూల కేంద్రం. అంతేకాదు.. 1998-2004 మధ్య కేంద్ర ప్రభుత్వంలో ఆయనది కీలక పాత్ర. ఓ దశలో అద్వానీ ప్రధాని కావడమే మిగిలింది. వాజ్ పేయీని అనారోగ్య కారణాల రీత్యా తప్పించి అద్వానీని ప్రధాని చేస్తారన్న కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ, ఎక్కడో అడ్డుకట్టపడి ఉప ప్రధాని (2002)గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అప్పడు గెలిచి ఉంటే ప్రధానే..
భారత్ షైనింగ్ అంటూ 2004 ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. ఘోర పరాజయం పాలవడం అద్వానీ ప్రధాని ఆశలను చిదిమేసింది.ఆ తరువాతి సంవత్సరమే పాకిస్థాన్ వెళ్లి మొహ్మద్ అలీ జిన్నాను పొగడడం ఆయనను పార్టీలో ఒంటరిని చేసింది. సంఘ్ ఆగ్రహానికి గురై పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2009లోనూ బీజేపీ పరాజయంతో అద్వానీ శకం దాదాపు ముగిసినట్లయింది. ఇక 2014లో మోదీ వచ్చాక అద్వానీ ప్రస్తావనే లేకుండా పోయింది.
నాడు మోదీని కాపాడింది అద్వానీనే..
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోదీ సీఎంగా దిగిపోవాలని బీజేపీ మిత్ర పక్షాల నుంచే డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆఖరికి ప్రధానిగా ఉన్న వాజ్ పేయీ సైతం ''రాజధర్మం'' పాటించాలంటూ మోదీకి పరోక్షంగా వైఫల్యాన్ని గుర్తుచేశారు. కానీ, అద్వానీ మాత్రం మోదీని బలంగా సమర్థించారు. ఆయన సీఎం పదవిని కాపాడారు. ఇది అందరికీ తెలిసిన బహింరగ రహస్యమే. నాడు సీఎంగా గనుక మోదీ తప్పుకొని ఉంటే.. ఆయన రాజకీయ జీవితం సమాప్తమయ్యేది. ఇప్పుడు ప్రధానిగా ఉండేవారు కూడా కాదు. అయితే, అద్వానీ నెరవేర్చుకోలేక పోయిన ప్రధాని కలను ఆయన శిష్యుడు మోదీ తీర్చుకోవడం విశేషం.
గురువుకు న్యాయం చేయని మోదీ..
గుజరాత్ సీఎంగా తనపై వేటు పడకుండా చూసిన అద్వానీని మోదీ ప్రధాని అయ్యాక సముచిత రీతిలో గౌరవించలేదనే చెప్పాలి. దీనివెనుక జిన్నాను పొగిడినందుకు సంఘ్ కోపం ఉందనే చెప్పాలి. ఇక ప్రధాని పదవి చేజారిన అద్వానీని రాష్ట్రపతిగానూ పరిగణించలేదు. కేవలం పార్టీ సలహా మండలికి పరిమితం చేశారు. కాగా, మంగళవారంతో అద్వానీ 95 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అద్వానీ ఇంటికెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
1927లో జననం.
ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న కరాచీలో 1927లో అద్వానీ జన్మించారు. చాలా చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. అనంతరం జనసంఘ్ లో పనిచేశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ ఒకరు. తనదైన శక్తిసామర్థ్యాలతో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.