మాటంటే మాటే.. మాట మీద నిలవటం కోసం చాలామంది చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు మాటల్ని యధాలాపంగా చెప్పేస్తుంటారు కానీ.. వాటిని నిలబెట్టుకునే విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం కనిపించదు. మారిన కాలంతో పాటు సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్ గా మారిన నేపథ్యంలో.. ప్రముఖల మాటల్ని.. వారు చేసిన వ్యాఖ్యల్ని తరచూ గుర్తు చేయటం.. తేడా చేస్తే వారిని మందలించటం.. ఎటకారం చేయటం ఎక్కువైంది. చిన్న తేడాకు కూడా ట్రోల్ చేయించుకునే కన్నా.. బుద్దిగా చెప్పిన పని చేయటానికి కొందరు ప్రముఖులు ఇష్టపడుతున్నారు.
మిగిలిన నేతలతో పోలిస్తే.. ప్రధానమంత్రి మోడీకి ఒక చక్కటి అలవాటు ఉంది. ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారికి భిన్నంగా ఆయన తీరు ఉంటుంది. అడగకుండానే ఆయన వరాలు ఇస్తారు. వాటిని నెరవేర్చే విషయాన్ని అంతే కమిట్ మెంట్ తో వ్యవహరిస్తారు. సగటు జీవుల మనసుల్ని దోచుకుంటారు. తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ కు ముందు భారత అథ్లెట్లను కలిసి.. వారిలో స్ఫూర్తిని నింపిన ఆయన.. ఆ సందర్భంగా క్రీడాకారులు వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ప్రస్తావించారు. పీవీ సింధుకు ఐస్ క్రీం ఇష్టమని చెప్పి ఆశ్చర్యపరిచిన ఆయన.. పతకం సాధించిన తర్వాత కలిసి ఐస్ క్రీం తిందామని మాట ఇచ్చారు.
అంతేకాదు.. ఇతర క్రీడాకారులతోనూ ఆయన పలు విషయాల్ని పంచుకున్నారు. ఆయన మాట ఇచ్చినట్లే.. పంద్రాగస్టున తన ఇంటికి ఒలింపిక్ క్రీడాకారుల్ని ఆహ్వానించిన ఆయన వారితో సరదాగా గడిపారు. ముందుగా మాటిచ్చినట్లే పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్న ఆయన.. బల్లెం వీరుడిగా పేరొందిన నీరజ్ చోప్రాతో కలిసి సుర్మా తిన్నారు. వందేళ్లకు పైనే సాగుతున్న ఒలింపిక్ చరిత్రలో ఒక భారత అథ్లెట్ తన వ్యక్తిగత ప్రతిభతో స్వర్ణాన్ని సాధించిన నేపథ్యంలో ఆయన్ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించటం తెలిసిందే. తన ఇంటికి వచ్చిన అథ్లెట్లను ప్రత్యేకంగా పలుకరించిన ఆయన.. ఒక్కో అథ్లెట్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. వారు సాధించిన విజయాల్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరింత బాగా రాణించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. క్రీడాకారులతో ఫోటోలు దిగిన ఆయన వారిలో అంతులేని స్ఫూర్తిని నింపారు. ఏమైనా.. మాట ఇవ్వటమే కాదు.. నిలబెట్టుకునే విషయంలోనూ మోడీ కమిట్ మెంటే వేరని చెప్పక తప్పదు.