ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుర్ర లేని పనులు చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయనకు కామన్‌సెన్స్ లోపించడం వల్లే ఈ రోజు దేశంలోని ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డారని విమర్శించారు. కొత్తనోట్లకు ప్రస్తుత ఏటీఎంలు సపోర్ట్ చేయవన్న కనీస పరిజ్ఞానం లేకుండా నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
అంతేకాదు... అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేసినట్లు చెబుతున్నారు కానీ దీనివల్ల కొత్త వర్గాలు కూడా అవినీతిని అలవాటు చేసుకుంటున్నాయని ఆరోపించారాు. కింది స్థాయి బ్యాంకు సిబ్బంది అవినీతికి పాల్పడిన చరిత్ర గతంలో లేదని… కానీ మోడీ నిర్ణయంతో ఇప్పుడు బ్యాంకుల్లోనూ అవినీతి పెరిగిందన్నారు. పెద్దవాళ్ల దగ్గరకు కోట్లాదిరూపాయల కొత్త నోట్లు ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు.
నిజాయితీపరులైన మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌లు పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తుంటే… అంబానీ, ఆదానీ మాత్రం నోట్ల రద్దును స్వాగతిస్తున్నారన్నారు. దీన్ని బట్టే నల్లధనం ఉన్న వారెవరూ మోడీకి భయపడడం లేదని అర్థమవుతోందన్నారు. పనిలో పనిగా చంద్రబాబుపైనా ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు 50 లక్షలు ఇవ్వడంతో పాటు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా, అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ కోర్టు స్టేలు తెచ్చుకుంటున్న చంద్రబాబును ముఖ్యమంత్రుల కమిటీకి అధ్యక్షుడిగా చేయడం కంటే దారుణం ఇంకోటి లేదని ఆయన విమర్శించారు.