ముస్లిం బాలిక మోడీకి లేఖ రాస్తే..

Update: 2017-03-23 10:12 GMT
కొన్ని మాట‌లు విన్న‌ప్పుడు సాధ్య‌మేనా? అన్న భావ‌న క‌లుగుతుంది. కానీ.. ఒక‌టికి నాలుగుసార్లు జ‌రుగుతున్న వేళ‌.. న‌మ్మ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది. ఏదైనా స‌మ‌స్య‌తో ప్ర‌ధాన‌మంత్రికి లేఖ రాస్తే ప‌ట్టించుకుంటారా? అన్న సందేహం చాలామందికి క‌లుగుతుంది. ఎవ‌రికైనా చెప్పినా.. విచిత్రంగా చూస్తారే కానీ ఒక‌ప‌ట్టాన న‌మ్మ‌రు. కానీ.. గ‌తంలో మాదిరి ప‌రిస్థితి లేద‌ని.. ఇప్పుడు చాలానే మార్పు వ‌చ్చింద‌ని.. ఒక సామాన్యుడు సైతం త‌న స‌మ‌స్య‌ను ప్ర‌ధాన‌మంత్రికి చెప్పుకోవాల‌నుకుంటే.. ఒక లేఖ ముక్క‌తో ఆయ‌న‌కు స‌మాచారం వెళుతుంద‌న్న విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది.

తాజాగా క‌ర్ణాట‌క‌కు చెందిన ఒక ముస్లిం బాలిక సారాకు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకోవాల‌న్న‌ది ఆశ‌.  ఇందుకు అవ‌స‌ర‌మైన రుణసాయం కోసం ఆమె ప‌లు బ్యాంకుల్ని ఆశ్ర‌యించింది. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం రాలేదు. తిరిగి చెల్లించే  స్తోమ‌త లేదంటూ బ్యాంకు అధికారులు ఆమెకు రుణాలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. చ‌దువుకోవాల‌న్న ఆశ‌తో అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. విసిగిన ఆ బాలిక నేరుగా ప్ర‌ధాని మోడీని ఆశ్ర‌యించింది. ఆయ‌న‌కో లేఖ రాసింది. అందులో త‌న ప‌రిస్థితిని వివ‌రించింది. తాను ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునేందుకు అవ‌స‌ర‌మైన రుణాన్ని అందించేలా సాయం చేయాల‌ని కోరింది.

అనూహ్యంగా ఆ లేఖ‌కు మోడీ నుంచి రిప్లై వ‌చ్చింది. అంతేకాదు.. ప‌ది రోజుల్లో ఆ బాలిక‌కు రూ.1.5ల‌క్ష‌ల  రుణసాయాన్ని అందించాలంటూ క‌ర్ణాట‌క చీఫ్ సెక్ర‌ట‌రీకి ప్ర‌ధాని లేఖ రాశారు. దీంతో..  అధికార యంత్రాంగం ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. ప్ర‌ధాని మోడీ ప‌ది రోజుల స‌మ‌యం ఇచ్చినా.. అధికారులు మాత్రం ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే ఆమెకు బ్యాంకు రుణం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. సారాకు అవ‌స‌ర‌మైన రుణ‌సాయాన్ని మాండ్యాలోని విజ‌య‌బ్యాంకు అందించింది. తాను రాసిన లేఖ‌కు ప్ర‌ధాని మోడీ నుంచి స్పంద‌న రావ‌టంతో సారా ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయింది. మోడీకి తాను రాసిన లేఖ‌కు త‌ప్ప‌నిస‌రిగా స‌మాధానం వ‌స్తుంద‌ని భావించాన‌ని.. కానీ.. ప‌ది రోజుల్లోనే వ‌స్తుంద‌ని మాత్రం అనుకోలేన్న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాని నుంచి స‌మాధాన‌మే కాదు.. ఏకంగా సాయం కూడా అంద‌టంతో ఆ ముస్లిం బాలిక కుటుంబం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News