హైదరాబాద్ ఇప్పుడు అత్యాధునిక నగరాల సరసన పూర్తిస్థాయిలో చేరింది. ప్రజారవాణాలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. మెట్రోరైలు పరుగులు మొదలవుతుండడంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయని నగర ప్రజలు సంతోషిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో తొలి రోజునే ఒక ప్రత్యేకత చూపింది. ప్రధాని ప్రయాణించిన తొలి మెట్రోను ఓ మహిళా పైలట్ నడపడంతో హైదరాబాద్ నగరం మహిళా సాధికారితను ప్రపంచానికి చాటింది.
తొలుత మెట్రో పైలాన్ ఆవిష్కరించిన మోదీ ఆ తరువాత మియా పూర్ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మన హైదరాబాద్-మన మెట్రోపై తయారు చేసిన ప్రత్యేక వీడియోను తిలకించారు. ఆ తర్వాత మెట్రో బ్రోచర్ తో పాటు మెట్రో యాప్ ను విడుదల చేశారు. మెట్రోరైల్ ను ప్రారంభించిన అనంతరం గవర్నర్ నరసింహన్ - తెలంగాణ సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ తో కలిసి మోదీ అందులో ప్రయాణించారు.
కాగా మోదీని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రోస్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చారు. దీంతో వారిని నిలువరించడం పోలీసులుకు బాగా కష్టమైంది. దీంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.
మరోవైపు మెట్రో ప్రారంభం కార్యక్రమం కోసం ట్రాఫిక్ ను ఆపేసి.. అనంతరం ఒక్కసారిగా విడిచిపెట్టడంతో అన్ని మార్గాల్లో ట్రాఫిక్ జామైపోయింది. దీంతో నగరవాసులు తెగ ఇబ్బందిపడ్డారు.