ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారిగా గతం తలుచుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఏనాడు లేనివిధంగా దురుద్దేశాలు ఆపాదించడంతో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి ఈ సందర్భంగా చరిత్రను వివరించారు. ఇదంతా చేసింది రాజకీయ కక్ష అనే వివరణ కోణంలోనే కావడం గమనార్హం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూముల లావాదేవీలపై దర్యాప్తు వివాదాస్పదమవడంతో మోడీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఎవరిపైనా తనకు కక్ష లేదని, ఏ రాజకీయ పార్టీపై గానీ వ్యక్తిపై గానీ దర్యాప్తు జరపాల్సిందిగా తన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివరించారు. పేర్కొన్నారు. ‘గుజరాత్ లో నేను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశా. రాజకీయ కారణాలతో నేను ఎన్నడూ ఎవరి కేసుకు సంబంధించిన ఫైల్ ను తెరిపించలేదనడానికి చరిత్రే సాక్ష్యం. నాపై అటువంటి ఆరోపణలేమీ లేవు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. ఎవరి కేసుకు సంబంధించిన ఫైల్ ను తెరవాలని మా ప్రభుత్వం ఎన్నడూ ఆదేశాలు జారీ చేయలేదు’ అని మోడీ ‘సిఎన్ ఎన్-న్యూస్ 18’ వార్తా సంస్థతో అన్నారు. సోనియా గాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న ఆరోపణ గురించి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మోడీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఎవరికీ వత్తాసు పలికే హక్కు నాకు లేదు. అంతేతప్ప మేము ఎవరినీ ఖాతరు చేయడం లేదని చెప్పడం సరికాదు’ అని మోడీ పేర్కొన్నారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూ లావాదేవీలపై హర్యానాలోని బిజెపి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ దర్యాప్తు జరుపుతుండటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసి తద్వారా తన పరిపాలన తీరును వివరించారు.