మోడీకి మ‌ద్ద‌తిచ్చిన అందాల భామ

Update: 2016-07-16 15:29 GMT
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఊహించ‌ని కితాబు ద‌క్కింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మోడీ ప‌థ‌కాల‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. పాకిస్థానీ మోడల్ ఖందీల్ బలోచ్ దారుణహత్యకు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మీడియాతో ఉద్విగ్నభరితంగా మాట్లాడుతూ మోడీని రాఖీ సావంత్ కీర్తించారు - అదే స‌మ‌యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖందీల్ బలోచ్ దారుణ హత్యకు గురించి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా సరే ఆడపిల్లను హత్య చేయొచ్చా అని ప్రశ్నించారు. త‌మ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోలేద‌ని హ‌త్య చేయ‌డం ఏమిట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. దీనిపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భేటీ బచావో - భేటీ పడావో పేరుతో త‌మ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ  చేపట్టిన కార్యక్రమాలను చూసి షరీఫ్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. బలోచ్‌ ను హత్య చేసిన ఆమె సోదరుడు గఫూర్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News