తమ పార్టీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయిలు ఎర వేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను ఇప్పటికే విలేకరుల సమావేశంలో బయటపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. పెను సంచలనానికి తెర తీశారు. ఆశ్చర్యకరంగా.. ఆయన ప్రెస్ మీట్ మీద జాతీయస్థాయిలో స్పందన శూన్యమన్నట్లుగా ఉంది.
అయితే.. ఈ ఉదంతంపై ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర అంశం.. ఆ సందర్భంగా ప్రధాని పేరు ప్రస్తావన వచ్చిన వీడియో ఫుటేజ్.. దానికి సంబంధించిన వివరాల మీద ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రెస్ మీట్.. ఆయన ప్రస్తావించిన అంశాలపై క్రాస్ చెక్ చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్ లో బీజేపీ మధ్యవర్తులుగా ఇద్దరు స్వామిజీలతో పాటు.. నందూ అనే వ్యాపారి ఒకరు రంగంలోకి దిగటం తెలిసిందే.
తమ ప్రభుత్వాన్ని పడగొట్టటమే లక్ష్యంగా ఈ మిషన్ పని చేస్తుందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ డబ్బుల కతేంది? దాని వెనుకున్న పెద్దోళ్లు ఎవరు? అసలీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నది లెక్క తేలాలంటూ ఆయన పెద్ద ఎత్తున ప్రశ్నల్ని సంధించారు.
ఇక.. కేసీఆర్ ప్రదర్శించిన వీడియోలోని వ్యక్తులు.. వారి నేపథ్యాల మీద ఆరా తీయాలన్న ఆదేశాలు జారీ అయినట్లుగా చెబుతున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితంచేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన వివరాల మీద నివేదికను సిద్ధం చేయమని చెప్పినట్లుగా సమాచారం.
ఈ ఉదంతంపై బీజేపీ అధినాయకత్వం కూడా సీరియస్ గా ఉందని చెబుతున్నారు. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు.. పార్టీకి చెందిన నెంబర్ వన్.. నెంబర్ టూలను టార్గెట్ చేసిన వైనాన్ని అస్సలు వదిలిపెట్టకూడదని.. దానికి తగ్గట్లుగా కౌంటర్ ఇవ్వాలని పేర్కొన్నట్లు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.