తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మలిదశ ప్రచార పర్వంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ జిల్లాలు - నియోజకవర్గాల పర్యటనలో ఉన్న గులాబీ దళపతి ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ సభలో సీఎం ప్రసంగిస్తూ...ఆసక్తికర ప్రకటన చేశారు. గజ్వేల్ నియోజకవర్గం కంటే ఎల్లారెడ్డిలో రవీందర్ రెడ్డి ఎక్కువ చెరువులు అభివృద్ధి చేసుకున్నరని..ఆ గౌరవం వారికే దక్కిందని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని నగర్ మండలంలోని చెరువులో ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ వివరించారు. ``ఐటీ రంగం - పారిశ్రామిక రంగంలో ముందుకు పోతున్నం. ఆడబిడ్డలను ఆదుకున్నాం. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు పించన్ ఇస్తున్నం. మళ్లీ టీఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తది. పెన్షన్ దారులందరికీ వెయ్యి పెన్షన్ ను పెంచి 2,016 రూపాయలు అందజేస్తమన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎల్లారెడ్డిలో అన్ని గ్రామాలకు నీళ్లు చేరాయని - నల్లాల కలెక్షన్లు ఇచ్చే పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేదు. దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా రైతు బీమా తీసుకొచ్చినం. ఏ పైరవీ లేకుండా ఏ అధికారి వద్దకు పోకుండా వారి ఖాతాల్లో బీమా సొమ్ము పడేలా చర్యలు తీసుకుంటున్నాం`` అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అనంతరం ఎల్లారెడ్డి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ``ఎల్లారెడ్డి ప్రజలను నేను కోరేది ఒకటే.. ఇంత మంచిసేవకుడిగా పని చేసేవాడిగా ఉన్నడు కాబట్టి.. నాక్కూడా సన్నిహితుడుగా ఉన్నడు కాబట్టి.. తప్పకుండా ఈసారి గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడు.. ఆయనకు కూడా ఎలివేషన్ వస్తుంది. రవీందర్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి ఎల్లారెడ్డి యొక్క గౌరవం పెంచాలని కోరుతా ఉన్నాను.`` అని ప్రకటించారు. తద్వారా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రవీందర్ రెడ్డికి తమ సర్కారు వస్తే మంత్రి పదవి
దక్కుతుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు.