మూడేళ్ళ‌లో పీఓకే మ‌న‌దేనంటున్న నేత‌..

Update: 2019-09-12 11:04 GMT
భార‌త్ త‌ల ఏదంటే మ‌నంద‌రికి గుర్తుకొచ్చే పేరు... హిమ‌పాతాల‌తో ప‌చ్చ‌ని చెట్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే క‌శ్మీరం గుర్తుకొస్తుంది. అయితే ఆ హిమ‌పాతాలు - ప‌చ్చ‌ని లోయ‌లు ఇప్పుడు తుపాకి మోత‌ల‌తో - మోర్టార్ల దాడుల‌తో - భ‌ద్ర‌తాద‌ళాలు - ఉగ్ర‌వాదుల దాడులు ప్ర‌తిదాడుల‌తో ర‌క్త‌పాతం పారుతున్న నేల‌గా మారింది. భ‌ర‌త‌మాత త‌ల‌ను ర‌క్త సిక్తం చేస్తూ ద‌యాది పాకిస్తాన్ పెట్రేగిపోతుంటే స‌గ‌టు భార‌తీయుడు గుండె మండుతుంది.. పాకిస్తాన్  ఉగ్ర‌వాదుల అండ‌తో క‌శ్మీర్‌ లోని కొంత భాగాన్ని చెర‌బ‌ట్టి ర‌క్త‌పుటేరులు పారిస్తుంది.

పాక్ చెర‌లో ఉన్న పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ఎప్పుడు భార‌త్ వ‌శ‌మ‌వుతుందా.. ఈ ర‌క్త‌పుటేరులు ఎప్పుడు ఆగిపోతాయా అని కాశ్మీర్ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న‌త‌రుణంలో దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. క‌శ్మీర్‌ లో కొన‌సాగుతున్న ఆర్టిక‌ల్ 370 ని ర‌ద్దు చేసి అక్క‌డ ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ స్వాతంత్య్రాల‌ను అందించారు. ఇక ఇప్పుడు పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ను భార‌త్ వ‌శం చేసేందుకు భార‌త్ ప్ర‌య‌త్నించాల్సి ఉంది.

అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిందా అనే అనుమానాల‌కు ఊత‌మిస్తున్నాయి శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ మాట‌లు. 2022నాటికి పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌ లో కలిసిపోతుంది. జమ్మూ‍కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక త్వరలోనే పీవోకే కూడా భారత్‌ స్వాధీనం చేసుకుంటుందని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజ‌య్ రౌత్ మాట‌ల్లో  కశ్మీర్‌ మా అంతర్గత అంశమని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు చెప్పారు.

పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ ఖాన్ వ్య‌వ‌హ‌రశైలీ మారింది..  కశ్మీర్‌ పూర్తిగా భారత్‌ నియంత్రణలోకి వచ్చేసింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేశారు. త్వరలో పీవోకే కూడా భారత్‌ లో అంతర్భాగమవుతుంది. 2022 నాటికి అఖండ భారత స్వప్నం సాకారమవుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యాలు చూస్తే న‌రేంద్ర‌మోడీ ఇదే వైపు చ‌ర్య‌లు తీసుకుంటున్నారా ? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.


Tags:    

Similar News