పిచ్చిపిచ్చిగా పోకమాన్‌ పిచ్చి!!

Update: 2016-07-13 16:31 GMT
పోకమాన్ (Pokemon).. 1990లో వీడియో గేమ్ లోకాన్ని ఊపేసిన ఒక గేమ్ ఇది. ఇప్పుడు జి.పి.ఎస్. టెక్నాలజీతో రియల్ వరల్డ్ ఆగ్మంటేషన్‌ అనే కాన్సెప్టుతో ఇప్పుడు జస్ట్ ఒక రెండు వారాల నుండి ప్రపంచాన్ని ఊపేస్తోంది. అప్పట్లోనే రకరకాల ఆకారాల జంతువులను కనిపెట్టడం అనే కాన్సెప్టు మీద క్రియేట్ చేయబడిన ఈ గేమ్‌ అంత పాపులర్ అయితే.. ఇప్పుడు చూస్కోండి కొత్తగా వచ్చింది ''పోకమాన్ గో'' హడలెత్తిస్తోంది.

మన హీరోయిన్లు కూడా చాలామంది ఈ పోకమాన్‌ గురించి ట్వీట్లు చేస్తుండటం మీరు చూసే ఉంటారు. అయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏకంగా ట్విట్టర్ య్యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో.. ఇప్పుడు ఆ సంఖ్యను  ఈ పోకమాన్‌ గేమర్లు దాటేస్తున్నారు.  అబ్బే ఏం లేదు.. మన మొబైల్ లో పోకమాన్ లోడ్ చేసుకోవడం ఫ్రీ. ఆ తరువాత మన స్ర్కీన్ లో మనం ఉన్న ప్రాంతపు మ్యాప్ అండ్ లొకేషన్‌ కనిపిస్తుంది. అక్కడకు దగ్గర్లో.. 0.2 కిమి అనో.. 100 మీటర్లు అనో.. అక్కడకు మనం చేరుకోగానే ఆ జంతువు మనకు దొరుకుతుంది. అంటే రియల్ లైఫ్‌ లో చేజ్ చేస్తే.. వర్చువల్‌ లైఫ్ లో మనం ఆ జంతువును సొంతం చేసుకోవచ్చు.

ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు జనాలు కుప్పలు తెప్పలుగా ఎగబడుతున్నారు తెలుసా. పోన్లేండి.. మామూలుగా ఎక్సర్ సైజ్ చేయని వారు.. కనీసం ఇలాగైనా కాస్త కొవ్వు తగ్గించుకోవచ్చు.
Tags:    

Similar News