కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం ఏమీ లేదు. ఉన్నా కూడా అది అంతంత మాత్రమే ! వీలున్నంత వరకూ కేంద్రం నుంచి వస్తున్న నిధులు కూడా పెద్దగా లేవు. వచ్చినా కూడా వాటిని సంక్షేమానికే వెచ్చిస్తూ ఉన్నారు. ఉన్న కొద్ది పాటి నిధులనూ ఈ విధంగా ఉచిత పథకాలకే కేటాయిస్తే అభివృద్ధి అన్నది ఏ విధంగా సాధ్యం అన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. ఇదే సందర్భంగా మొన్నటికి మొన్న వచ్చిన వరదలకు చాలా ఆస్తి నష్టం, పంట నష్టం కలిగింది. వాటిని భర్తీ చేసేందుకు కనీసం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వమని కేంద్రాన్ని అడిగినా రాష్ట్రం పట్ల కేంద్రం అస్సలు కరుణ అన్నది చూపలేదు.
అంతేకాకుండా పోలవరం నిర్వాసితులకు సంబంధించి అందించాల్సిన ఆర్ ఆర్ ప్యాకేజీ పై కూడా ఓ స్పష్టత లేదు. ప్యాకేజీ విషయమై తానేం చేయలేనని కూడా జగన్ చేతులెత్తేశారు. ఇక వరద ముంపు ప్రాంతాలన్నవి ఇప్పటికీ కోలుకోలేదు. కొన్ని చోట్ల బాధితులకు కనీస స్థాయిలో వైద్య సాయం అందడం లేదు.
దీంతో ఆపద వేళల్లో వైద్య సాయం అందుకోని వారు ప్రాణాలు విడుస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఇటు కేంద్రం కానీ అటు రాష్ట్రం కానీ వీరిని పట్టించుకున్న దాఖలాలే లేవు. చాలా వరకూ తామేం చేయలేం అన్న నిస్సహాయతను మాత్రం ప్రభుత్వ వర్గాలు వినిపిస్తూ వస్తున్నాయి.
ఇక నిన్నటి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ మరోసారి నిధుల విషయమై ప్రస్తావన తెచ్చారు. పోలవరం పూర్తికి తాత్కాలిక నిధులు పది వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తన గోడు వినిపించారు.
ముఖ్యంగా ఎప్పటి నుంచో పోలవరం నిధుల విషయమై వివాదం నెలకొని ఉంది. ఏపీ ప్రభుత్వం తాము ఇస్తున్న నిధులకు లెక్కలన్నవి చెప్పడం లేదని, దాంతో ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయని, ప్రాజెక్టు పనులు కూడా ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వ పర్యవేక్షణ లేని కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని కేంద్రం అంటోంది. ఏపీ సర్కార్ అడిగిన దాని కన్నా తక్కు వ మొత్తాన్నే ఇస్తూ కాలం నెట్టుకు వస్తోంది. ఫలితంగా పనులు వేగవంతం కావడం లేదు.
ఇవే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఇందుకు లక్ష కోట్లు అవసరం అవుతాయని, అంత మొత్తంతో తాము రాజధాని పనులు చేపట్టలేమని ఎప్పుడో తేల్చేశారు. దీంతో సంబంధిత పనులు ఎప్పుడో ఆగిపోయాయి. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన ప్రకటన ఆధారంగానే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. పర్యవసానాలు ఎలా ఉన్నా పట్టించుకోలేని స్థితిలో ఏపీ సర్కారు ఉండిపోయిందన్న వాదన కూడా ఉంది.