అదెలా ? హైదరాబాద్ పోలీసులు అలా ఎలా చేస్తారు?

Update: 2021-10-29 05:51 GMT
కొత్త నిజం బయట కు వచ్చింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం లో హైదరాబాద్ పోలీసులు అనుసరిస్తున్న తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు.. ఆ పేరు తో చేపడుతున్న తనిఖీ ల్లో మానవ హక్కుల్ని.. వ్యక్తి గత గోప్యత ను యథేచ్ఛ గా ఉల్లంఘిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. నాకాబందీ.. స్పెషల్ డ్రైవ్ పేరు తో చేసే తనిఖీల్లో.. వాహన పత్రాల పరిశీలన కు పరిమితం కాకుండా.. సెల్ ఫోన్లు.. వారి వాట్సాప్ ఖాతాల్ని పరి శీలిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

వ్యక్తి గత గోప్యత కు గొడ్డలి పెట్టు అన్నట్లు గా తనిఖీల పేరు తో హైదరాబాద్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి.. వాహనదారుల మొబైల్ పోన్లను తనిఖీ చేస్తున్నారు. ఫోన్ ప్యాటర్న్ లాక్.. పిన్ నంబర్.. పాస్ వర్డ్ లు తీయించి మరీ వాట్సాప్ మెసేజ్ లను పరి శీలిస్తున్న వైనం పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తీరు ముమ్ముటికి హక్కుల ఉల్లంఘనే అవుతుందని న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనం ఒక ప్రముఖ మీడియా సంస్థ లో పబ్లిష్ అయ్యింది.

సదరు కథనం పేర్కొన్న దాని ప్రకారం హైదరాబాద్ నగర ప్రజల వ్యక్తి గత స్వేచ్ఛను కాలరా చేలా పోలీసులు వ్యవ హరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్య ముమ్మాటి కి హక్కుల ఉల్లంఘనే అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒకరు తన ఫోన్ ను పోలీసులు బలవంతం గా లాక్కున్నారని పేర్కొనటంతో పాటు.. అదెలా జరిగిందో వివరించారు.

నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఆరు గంటల సమయం లో మెహిదీపట్నం నుంచి మల్లే పల్లి వైపు వెళుతున్న సదరు యువకుడ్ని పోలీసులు ఆపారు. వాహన పత్రాల్ని అడగటానికి బదులు గా సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పారని.. ఎందుకు? అని ప్రశ్నించే సాహసం చేయలేక తన ఫోన్ ఇచ్చానని..అన్ లాక్ చేసి.. వాట్సాప్ చాట్ చూశారని పేర్కొన్నారు. ఒక చాటింగ్ లో తన చెల్లి శాండ్ విచ్ తీసుకురావాలన్న మెసేజ్ ఉంటే.. దాని గురించి అడిగారని.. నిజంగా నే తన చెల్లెలు శాండ్ విచ్ అడిగిందన్న విషయాన్ని నిర్దారించుకున్నతర్వాత తన ను వదిలినట్లు గా పేర్కొన్నారు.

ఇలాంటి చేదు అనుభవం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఎదురైనట్లు గా తెలుస్తోంది. వాట్సాప్ చాట్ తనిఖీ చేయటం తో పాటు.. గడిచిన పది రోజులుగా గంజాయి.. డ్రగ్స్ స్పెషల్ డ్రైవ్ పేరు తో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భాగం గా ఫోన్లను కూడా తనిఖీలు చేస్తుండటం గమ నార్హం. ఇది వ్యక్తి గత స్వేచ్ఛను.. గోప్యత హక్కు ను ఉల్లంఘించి నట్లేనన్న మాట వినిపిస్తోంది. డ్రగ్స్.. గంజాయి.. వీడ్ లాంటి పదాల్ని వాట్సాప్ చాటింగ్ లో తనిఖీ చేయాలన్న ఆదేశాలు తమకు ఉన్నాయని.. అందు కే తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే.. ఈ తీరు ఏ మాత్రం సరి కాదని న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల్ని ఆపి.. వాహన దారుల ఫోన్ చెక్ చేయాలంటే పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాలని.. సీఆర్పీసీ లోని సెక్షన్ 91 ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫోన్ ను తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా బలవంతపు తనిఖీలు ప్రైవసీ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రముఖ న్యాయ వాది జయ వింధ్యాల పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నేరస్తుల్ని గుర్తించేందుకే ఇలా చేస్తున్నట్లు గా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేస్తున్నారు. కేసుల్ని కొలిక్కి తెచ్చే క్రమంలో ఇలా చేస్తామని.. కేవలం నేరస్తుల్ని.. అ సాంఘిక శక్తుల్ని గుర్తించటాని కే ఇలా చేస్తామని ఆయన సర్ది చెబుతున్నా.. ఈ తీరు ఏ మాత్రం సరి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News