గత ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మంగళ - బుధ - గురు వారాల్లో కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్న పోలీసుల ఆదేశాలను ప్రదీప్ బేఖాతరు చేశాడు. ప్రదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం - ఆయన ఇంట్లో - ఆఫీసులో కూడా లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ప్రదీప్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆఖరి రోజైన శుక్రవారంనాడు ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే అతడిపై చార్జి షీటు దాఖలు చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భంగా 1683 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయని హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు ప్రదీప్ అభిమాని అయిన ఓ అమ్మాయి స్పందిస్తూ.....ప్రదీప్ ను వదిలేయమని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. అయితే, ఆ అమ్మాయికి హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే రిటార్ట్ ఇచ్చారు.
ప్రదీప్ నకు మద్దతుగా ఓ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ``సార్ - ప్లీజ్ మా యాంకర్ ప్రదీప్ ను వదిలేయండి - పాపం చిన్నపిల్లవాడు - తెలియక చేశాడు`` అంటూ ఆ అమ్మాయి విజ్ఞప్తి చేసింది. దీనికి హైదరాబాద్ పోలీసులు ఘాటుగా స్పందించారు. ప్రదీప్ చిన్న పిల్లాడైతే పాలు తాగి పడుకోవాలని - మందు తాగి కారు నడపడం కరెక్టు కాదు కదా అని క్లాస్ పీకారు. మిగిలిన వారికి ఆదర్శంగా నిలవవలసిన సెలబ్రిటీలు ఇలా చేయడం కరెక్టుకాదని రిప్లై ఇచ్చారు. మరోవైపు - మంగళ - బుధ - గురువారాలలో కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. ఒకవేళ ప్రదీప్ శుక్రవారం కూడా కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే చార్జిషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రదీప్ ఈ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ఓ ప్రముఖ వ్యక్తి ద్వారా ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ మణికొండలోని ఓ ఫాంహౌస్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.