పరారీలో ‘స్వర్ణ ప్యాలెస్’ నిందితుడు రమేశ్ బాబు!

Update: 2020-08-11 13:00 GMT
కరోనా కల్లోలం వేళ విజయవాడలో ‘స్వర్య ప్యాలెస్’ హోటల్ ను అద్దెకు తీసుకొని కోవిడ్ సెంటర్ గా మార్చారు. అయితే కాసుల కక్కుర్తిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో 12మంది కరోనా బాధితులు కాలి బూడిదయ్యారు. ఈ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు , రమేష్ ఆసుపత్రి యజమాని రమేశ్ బాబు పరారీలో ఉన్నట్టు తెలిసింది. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నట్టు సమాచారం.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేశ్ ఆసుపత్రి కాసుల కక్కుర్తి, స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాన్యాల నిర్ణక్యమే కారణమని కమిటీ విచారణలో తేలినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు అగ్నిమాపకదళానికి సమాచారం ఇవ్వకుండా రోగుల ప్రాణాలు పోయేలా చేశారని కమిటీ తేల్చింది. ఫైర్ సర్వీసుకు సమాచారం వస్తే రోగుల ప్రాణాపాయం తప్పేదని తేల్చారు.

అగ్ని ప్రమాదం గుర్తించే పరికరాలు, అలారం పనిచేయలేదని.. దీంతో ప్రాణ నష్టం జరిగిందని కమిటీ సభ్యులు తేల్చారు. రమేశ్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని కమిటీ సభ్యులు నిర్ధారించారు. రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు.. అనుమతికి మించి రోగులను చేర్చుకున్నట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలిసింది.

ఇక ఇంటీరియల్ డెకరేషన్ పై శానిటైజేషన్ ఎక్కువగా చేయడం వల్లే మంటలు వ్యాపించాయని విద్యుత్ ఈ ప్రమాదానికి కారణంగా నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ప్రమాదానికి సూత్రధారి డాక్టర్ రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:    

Similar News