అసదుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే !

Update: 2020-03-13 12:33 GMT
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. కేంద్రం,ఓ అధికారం లో ఉన్న బీజేపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన సమయం నుండి ఒవైసీ కేంద్రం పై యుద్ధం ప్రకటించి ..ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ , వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ , కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని ఓ సభ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలివ్వగా.. మొఘల్‌ పురా పోలీసులు కేసు నమోదు చేశారు.ఆయన తో పాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. ఇటీవల ఎన్‌ఆర్‌సీ,సీఏఏలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగిన ఓ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఆ సభలో ఆయన పలు వివాదాస్పద కామెంట్స్ చేసారు అని అయన పై ఆరోపణలు ఉన్నాయి. దీని తో ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేసి , విచారణ జరుపుతున్నారు. అలాగే , గతేడాది నవంబర్‌ లో అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతోనూ గతం లో అసదుద్దీన్‌ పై ఉత్తరప్రదేశ్‌లోనూ కేసు నమోదైన విషయం తెలిసిందే.
Tags:    

Similar News