టీవీ నటి శ్రీవాణి చిక్కుల్లో చిక్కుకున్నారు. సోదరుడి ఆస్తి విషయంలో ఆమె అత్యుత్సాహం ఇప్పుడు కేసుల వరకూ వెళ్లటమే కాదు.. మీడియాలో ఆమె పేరు.. ఫోటో మారుమోగుతున్న పరిస్థితి. ఆస్తి కోసం వదినను వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఆమెపై కేసు నమోదైంది కూడా. టీవీ సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలకు తగ్గట్లే రియల్ లైఫ్ లో ఆమె తీరు అభ్యంతరకరంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.
బాధితురాలు.. శ్రీవాణి వదిన అయిన అనూష వెల్లడిస్తున్న వివరాలు చూస్తే.. శ్రీవాణి సోదరుడితో తనకు వివాహం జరిగిందని.. అనారోగ్యంతో తన భర్త మృతి చెందారని చెప్పారు. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉండేవని.. తాజాగా తమకు ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయాలంటూ శ్రీవాణి.. ఆమె భర్త.. అమ్మ.. నాన్న.. అక్కా.. చెల్లెళ్లు తనపై ఒత్తిడి తెచ్చుస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.
తాజాగా వికారాబాద్ లో తాను ఉంటున్న ఇంటికి వాహనంలో వచ్చిన శ్రీవాణి.. ఆమె కుటుంబ సభ్యులు తనను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని.. ఒక దశలో జేసీబీతో ఇంటిని కూలగొట్టేందుకు సైతం ప్రయత్నించారని ఆమె వాపోతున్నారు. అయినప్పటికీ తాను వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవటంతో తనపై వారు దాడికి పాల్పడ్డారని చెబుతుననారు. తనను మానసికంగా.. శారీరకంగా హింసలకు గురి చేస్తున్నారంటూ ఆమె వాపోతూ.. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.