మెదక్ జిల్లా గజ్వేల్ లో దారుణ హత్య జరిగింది. ఓ పోలీస్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై కత్తులతో నరికి కిరాతకంగా హతమార్చారు.
హైదరాబాద్ లోని బేగంపేటలో కానిస్టేబులుగా పనిచేస్తున్న నర్సింహులు సొంత పనిపై గజ్వేల్ వెళ్లాడు. అక్కడ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆయనపై గుర్తు తెలియని కొందరు కత్తులతో దాడిచేసి దారుణంగా నరికి చంపారు.
అయితే... పోలీస్ కానిస్టేబుల్ హత్యలకు కుటుంబ కలహాలే కారణమైనట్లు భావిస్తున్నారు. ఆయనకు భార్యతో విభేధాలున్నాయని.. ఆ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సింహులు హత్యలో భార్య హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో ఆమె నర్సింహులుపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే... ప్రజలకు రక్షణగా ఉండే పోలీసునే నరికి చంపేస్తే ఇక సామాన్యులకు రక్షణ ఏముంటుందన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.