అర్థరాత్రి వేళ.. కారులో వెళుతున్న ఒక వ్యక్తిని రోడ్డు మీద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కారు ఆపమన్నాడు. అదేమీ పట్టించుకోకుండా కారులో వెళుతున్న అతనిపై సదరు కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఉదంతంలో సదరు వ్యక్తి మరణించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. వివేక్ తివారీ అనే వ్యక్తి ఐఫోన్్ కంపెనీలో ఏరియా మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆఫీసు అయ్యాక ఇంటికి కారులో వెళుతున్న అతడ్ని పోలీసు ఆపారు. కానీ.. అతను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
తాము ఆపినా ఆపని వ్యక్తిపై తన దగ్గరి తుపాకీతో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ కారణంగా మనోజో కారును డివైడర్ కు గుద్దారు. తీవ్ర గాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అతను మరణించాడు. కాల్పుల కారణంగా మరణించాడా? డివైడర్ ను గుద్దిన కారణంగా మరణించాడా? అన్నది పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలాల్సి ఉంది. అర్థరాత్రి 1.30గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతోంది. పోలీసులు ఆపినా ఆపకుండా కారును డ్రైవ్ చేసిన ఉదంతంలో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గోమతి నగర్ ఎక్స్ టెన్షన్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో మరణించిన మనోజ్ కానీ కానిస్టేబుల్ తుపాకీ కాల్పుల కారణంగా మరణించినట్లు తేలితే.. హత్యా నేరాన్ని కానిస్టేబుల్ మీద నమోదు చేస్తారని పోలీసులు చెబుతున్నారు. అయినా.. పెద్ద పెద్ద నేరాల విషయంలోనే చేష్టలుడిగినట్లుగా ఉన్న పోలీసులపై చర్యలు లేవు కానీ.. ఎందుకు కారు ఆపలేదో తెలీని వ్యక్తిపై కాల్పులు జరపటం కానిస్టేబుల్ అత్యుత్సాహమేనని చెబుతున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో మరణించిన మనోజ్ మద్యం సేవించాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కారులో మనోజ్ తో పాటు.. అదే కంపెనీలు పని చేసిన మాజీ ఉద్యోగి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.