ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్పృహలో లేని ఒక అమ్మాయిని భుజాన వేసుకొని వడివడిగా కిందకు దిగుతున్న ఒక పోలీసు ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ పోలీసు అధికారి చేసిన పనిని ప్రతి ఒక్కరూ కీర్తిస్తూ.. రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.
నిజంగానే.. అతడు చేసిన సాహసం తెలిస్తే అభినందించకుండా ఉండలేం. ప్రాణాలకు తెగించి మరీ.. విధి నిర్వహణలో కమిట్ మెంట్ ను ప్రదర్శించిన అతగాడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముంబయిలోని పబ్ లో ఇటీవల ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున బాధితులు అందులో ఇరుక్కుపోవటం తెలిసిందే.
పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు.. దట్టంగా కమ్ముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతూ..కొందరు స్పృహ కోల్పోయిన వారిని ఆదుకునేందుకు.. వారికి తక్షణ వైద్యంసాయం అందేలా చేయటం కోసం ఒక పోలీసు అధికారి ప్రాణాల్ని పణంగా పెట్టి పెద్ద సాహసమే చేశాడు.
మూడుసార్లు.. ఏడు అంతస్తులు ఎక్కి.. దిగి.. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రుల్ని భుజం మీద ఎక్కించుకొని కాపాడాడు. ఒక అమ్మాయిని భుజాన వేసుకొని మోస్తూ వస్తున్న ఫోటోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అతగాడు చేసిన సేవ వెలుగులోకి వచ్చింది. రియల్ హీరోగా అందరి అభినందనలు అందుకుంటున్న ఆ పోలీస్ అధికారి పేరు సుదర్శన్ షిండేగా గుర్తించారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే తమకేమాత్రం సంబంధం లేనట్లుగా పారిపోయిన పబ్ సిబ్బందితో పోలిస్తే.. విధి నిర్వహణలో భాగంగా తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా రిస్క్ చేసిన షిండేను ఎంత అభినంధించినా తక్కువే అవుతుంది.